ఉపవాస ప్రార్థన : దయచేసి ఈ వర్తమానమును వాట్సాప్ ఫేసుబుక్స్ లలో షేర్ చెయ్యండి
కొంతమంది ఫోన్ ఉపవాసము (ఫోన్ వాడకుండా), లేదా టీ.వీ ఉపవాసము (టీ.వీ వాడకుండా) , పని చెయ్యకుండా , ఎవ్వరితో మాట్లాడకుండా , ఎక్కడికి వెళ్లకుండా ఉపవాసము చేస్తున్నారు. అవన్నీ ఉపవాసాలలో భాగములే కానీ యేసుప్రభువు వారు చేసిన ఉపవాసము మాత్రము తినకుండా ఉపవాసము. ఆ దినములలో ఆయన ఏమియు తినలేదు. లూకా సువార్త (4 :2)
ఉపవాసములో ఒక భాగము – "మనకు ఇష్టమైనది వదలుకొనుట”.
ప్రతి రోజు సాదారణముగా అన్నింటి కంటే మనకు ఇష్టమైనది తిండి మాత్రమే.
ఉపవాసములో ఒక భాగము – "మనకు ఇష్టమైనది వదలుకొనుట”.
1. ఉపవాసము వల్ల ఉపయోగాలు
a. అప్పుడు యేసు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్లెను ; లూకా సువార్త (4 :14)
ఈ వచనమునకు ముందు రాయబడినది కేవలము యేసుప్రభువు వారి ఉపవాసము గురించి
యేసు ప్రభువు వారికి కూడా ఆత్మ బలము పొందుకోవాలంటే ఉపవాసము అవసరమైనది
నీవు ప్రార్థన సరిగ్గా చేసికొనలేక పోవుచున్నావా ? లేదా వాక్యము సరిగ్గా చదవ లేక పోవుచున్నావా
లేక విశ్వాసములో సరిగ్గా నిలబడలేక పోవుచున్నావా అయితే నీకు పరిశుద్దాత్మ బలము కావాలి.
దానికి ఉపవాసము ఒక తేలికైన మార్గము.
b. క్రొవ్వంతయు యెహోవాదే ; అది సువాసనగల హోమ రూపమైన ఆహారము. లేవీయకాండము (3:16 ) ఉపవాసము ఉన్నప్పుడు శరీరము యొక్క క్రొవ్వు కరుగుతుంది, ఈ ప్రక్రియ, పై వాక్యము ప్రకారము దేవునికి సువాసన గల హోమముగా మారుతున్నది . ఇది దేవుణ్ణి సంతోషపరచే కార్యము అందుకే ఉపవాస ప్రార్థన సాధారణ ప్రార్థన కన్నా శక్తివంతమైనది
c. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటి వరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది , బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు . మత్తయి సువార్త (11 :12 )
నిరాహార దీక్ష చేసేవారు ఆహారము మానివేసి బలవంతముగా ప్రభుత్వము నుండి ఉపయోగాలు పొందుకొంటారు.
మన ఇంట్లో పిల్లలు ఒక్కోసారి వాళ్ళు అడిగినది ఇస్తేనే అన్నము తింటానని బలవంతము చేస్తారు. వాళ్లు అడిగినది ఇస్తానంటేనే లేదా ఇస్తేనే అన్నము తింటారు.
అదే విధముగా మత్తయి సువార్త (11 :12 ) ప్రకారము పరలోక రాజ్యపు దీవెనలు కొన్ని రావాలంటే, కొన్ని ఆత్మలు మారుమనస్సు పొందాలంటే , ఆర్థికంగా అభివృద్ధి పొందాలంటే, నీకున్న కఠినమైన సమస్యలు పోవాలంటే దీక్షతో బలవంతము అనగా ఉపవాసము చేయవలసినదే.
అందుకాయన ప్రార్థనవలననే (ఉపవాసము వలననే) గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. మార్కు సువార్త (9:29)
d. ఉపవాసము మనిషి ఆయుర్దాయము పెంచుతుంది
వైద్య శాస్త్ర నిపుణులు దీన్ని పరిశోధించి తెలిసికొన్నారు. మనిషి శరీరములో బలహీనమైన కణాలు మరియు బలవంతమైన కణాలు ఉంటాయి. బలహీన కణాలు ఉపవాస ప్రక్రియలో సరైన ఆహారము అందక చనిపోతాయి. బలమైన కణాలు ఇంకా ఆరోగ్యకరంగా ఉత్తేజముగా ఎక్కువ కాలము పని చేయడానికి ఇది ఉపయోగ పడుతుంది.
వైద్య శాస్త్ర నిపుణులు ఈ విధముగా చెబుతున్నారు.
(i) ఈ రోజుల్లో ఎక్కువ యువకుల్లో కూడా జబ్బులు రావడానికి కారణము తిండి లోపము కాదు కానీ తిండి ఎక్కువగా తినుట వలన మాత్రమే, ఈ విధముగా అప్పుడప్పుడు ఉపవాసము చేయుట వలన అది సరి అవుతుంది . (Balance)
(ii) శరీరములో సున్నిత అవయవాలైన గుండె , లివర్ మొదలైన వాటి చుట్టూ ఉన్న హానికరమైన క్రొవ్వు కరుగుతుంది,
(iii) రక్త నాళంలో ఉన్న హానికరమైన ఉప్పు నిల్వలు కరిగి పోతాయి.
(iv) రక్తములో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.
(v) రక్తములో అధిక మోతాదులో ఉన్న షుగర్ కరుగుతుంది.
d. దేవుని యొద్దనుండి సంతోషము
మనము ఎంత ద్రవాహారాలు తాగినా, మనము తినక పొతే కడుపుకు తృప్తి అనేది ఉండదు.
అంటే ఉపవాసము ఒక రకముగా దుఃఖ పరచుకొనుటకు సూచనగా ఉన్నది. ఆ దినముల యందు దానియేలను నేను మూడు వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. దానియేలు (10:2)
ఉపవాసము ద్వారా దుఃఖపరచుకొనుట వలన దేవుని యొద్ద నుండి సంతోషకరమైన దీవెన వస్తుంది
ఇదే law of Balance. (Law of Balance -ఒకటి కోల్పోవుట వలన మరొకటి వచ్చి తీరాలి)
e. పరలోకపు ఆహారము వస్తుంది
ఉపవాసములో భూ సంభందమైన ఆహారము మాని వేయుట వలన మనకు పరలోక సంభందమైన ఆహారము వస్తుంది. ఇదే law of Balance. (Law of Balance -ఒకటి కోల్పోవుట వలన మరొకటి వచ్చి తీరాలి)
కొంత మంది దైవ సేవకులు లేదా విశ్వాసులు చాల పేద స్థితి లో ఉంటారు. కొన్ని సందర్భాలలో వారికీ చాల రోజుల వరకు తినడానికి ఏమి ఉండదు. అంటే దాని అర్ధము "దేవుడు వారి ప్రార్థనలను ఆలకించుట లేదు అని కాదు, కానీ దేవుడు వారిని భవిషత్తులో గొప్ప సేవ జరిగేలా వారి శరీరాన్ని సిద్ధపరచుచున్నాడు, ఇది కూడా ఒక రకమైన ఉపవాసమే". కొంతమంది విశ్వాసులకు ఆశీర్వాదాలు కళ్ళకు గంతలు కడతాయి. ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత కొంతమంది సేవ లేదా విశ్వాస జీవితము మొదట ఉన్నంత హృదయ పూర్వకముగా ఉండదు. పైన చెప్పబడిన కటిక లేమి లేదా ఉపవాసము ద్వారా దేవుడు వారిలో బలమైన విశ్వాసపు వేరు వ్య్యాపింపచేస్తాడు. దేవుడు గొప్ప గా మిమ్ములను తన చాచిన చేతితో బాహుబలాలతో ఆశీర్వదించిన తర్వాత ఒకప్పటి కటిక లేమి స్థితి లేదా ఉపవాసము ఒక సాక్షిగా నిలబడి నీవు దేవునికి ఇంకా ఎక్కువ కృతజ్ఞత కలిగేలా నిన్ను తయారు చేస్తుంది. నీ సేవ లేదా విశ్వాస జీవితము పడిపోకుండా నిలబడాలంటే ఉపవాసము చాల తేలికైన మార్గము. ఒక వేళ పడిపోయిన నీ సేవ లేదా పడిపోయిన నీ విశ్వాస జీవితము మరల నిలబడాలంటే ఉపవాసము చాల తేలికైన మార్గము. క్రమము తప్పకుండా చేసే ఉపవాస ప్రార్థనలు సాతాను సమూహాలను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.
2. ఉపవాసము ఎలా చేయాలి
a. ఉపవాసము అలవాటులేని వారు ఎక్కువ రోజులు ఉండుట వలన నీరసించి పోతారు. కనుక శరీరాన్ని క్రమముగా అలవాటు చేయాలి. అసలు అలవాటు లేని వారు మొదట ఒక పూట డిన్నర్ రాత్రి భోజనము మాని వేయుట , క్రమముగా ఇది రెండు రోజులు మూడు రోజులు రాత్రి భోజనము మాని వేయుట, ఆలా నీ యొక్క ప్రార్థనా భారాన్నిబట్టి కొన్ని వారాలు లేదా నెలల తర్వాత నీ శరీరము అలవాటు అయ్యేకొద్దీ రోజులు పెంచుకుంటూ ఉపవాసము చేయుటవలన మనము క్రమముగా ఆత్మ బలము పొందుకొంటాము.
ఇలా శరీరము అలవాటు అయ్యే కొద్దీ ఒక రోజంతా ఏమీ తినకుండా ఆలా క్రమ క్రమముగా రెండు మూడు సంపూర్ణ రోజులు , ఆలా నీ యొక్క ప్రార్థనా భారాన్నిబట్టి కొన్ని వారాలు లేదా నెలల తర్వాత నీ శరీరము అలవాటు అయ్యేకొద్దీ రోజులు పెంచుకుంటూ ఉపవాసము చేయుటవలన క్రమముగా ఆత్మ బలము పొందుకొంటాము. నిమ్మరసము , పళ్ళ లేదా కూరగాయల రసములు తీసికొని తిండి మాని వేయుట వలన మనము ప్రార్థనలో ఏకాగ్రతగా గడపవచ్చు . దేవుని కార్యాలు బలముగా చూడగలము.
b. ఉపవాసమునకు ముందు సిద్ధపాటు కావాలి
అలవాటు లేని వారు ఒకేసారి ఎక్కువ రోజులు ఉండటానికి శరీరము సహకరించక పోవచ్చు. ఉపవాసానికి కొన్ని రోజుల ముందు నుంచే దేవుని నడిపింపునకై , సిద్ద పాటుకై మరియు ఉపవాస ప్రార్థనకు ఆటంకాలు తొలగి పోవాలని ప్రార్థన చేస్తే మనము దేవుని గొప్ప శక్తిని అనుభవించగలము. ఉపవాసము ఉన్నప్పుడు కేవలము తిండి మాని వేయుట మాత్రమే కాక దేవుని సన్నిధిలో ఎక్కువసేపు గడుపుటవలన గొప్ప పరిశుద్దాత్మ శక్తిని పొందుకోగలము . ఉపవాస సమయాల్లో నీకు మరియు వేరే వ్యక్తులకు లేని పోని గొడవలు సృష్టించాలని సాతాను చూస్తుంటాడు , కనుక దాని విషయమై కనిపెట్టి జాగ్రత్త కలిగిఉండుట మేలు.
దేవుని పని ఎక్కువగా చెయ్యాలంటే పరిశుద్దాత్మ శక్తి ఇంకా ఎక్కువగా పొందుకొనుట అవసరము
ఈ భూ లోకములో మనము ఎన్ని సుఖాలు అనుభవించినా ఎన్ని ఆస్తులు సంపాదించినా పరలోకములో నికి వెళ్లిన తర్వాత మనకు ఇవి ఏమి యేసయ్య సింహాసనము ముందు ఎన్నిక చేయబడవు కానీ మనము ఆయన కొరకు ఎంత పని చేసామో అది మాత్రమే లెక్క చేయబడుతుంది. చాల మంది పెద్ద పెద్ద కంపెనీస్ లో పని చేయుట ధన్యతగా, వాళ్ళ జీవితాంత కలగా (Dream in Life) భావిస్తారు. మనము యేసయ్య రాజ్యము ("JESUS Company") లో పని చేయుట గొప్ప ధన్యత. శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి . శ్రమలో నీకు ఓర్పు కావాలి అంటే ప్రార్థనలో పట్టుదల కావాలి , దీనికి ఉపవాసము తేలికైన మార్గము. దేవుడు ఈ వర్తమానమును దీవించును గాక.
No comments:
Post a Comment