Monday, February 7, 2022

ముఖ దర్శనం చాలయ్యా సాంగ్ | Mukha Darshnam Chalayya Song lyrics

ముఖ దర్శనం చాలయ్యా
నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
సమీపించని తేజస్సులో నివసించు
నా దైవమా (2)
నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
యేసయ్యా యేసయ్యా 
యేసయ్యా యేసయ్యా (2)

1. అన్న పానములు మరచి నీతో గడుపుట
పరలోక అనుభవమే
నాకది ఉన్నత భాగ్యమే (2)
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా (2)

2. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది
మహిమలో చేరుటయే
అది నా హృదయ వాంఛయే (2)
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా (2)

3. కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి
గానము చేసేదను
ప్రభువా నిత్యము స్తుతియింతును (2)
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా (2) ||ముఖ||

దయాకిరీటం అనుగ్రహ సంవత్సరం 2025 New Year Song

AFC LYRICS దయాకిరీటం అనుగ్రహ సంవత్సరం 2025 New Year Song  పల్లవి: దేవా దయా కిరీటం మా శిరస్సుపై - ధరియింపుమా! సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వ...