పల్లవి:- మేలు కలుగ చేయుటకై -
ఆశ్రయించు వారికి- తోడుగా ఉండును -
దేవుని హస్తము...
అనుపల్లవి:- దేవుని హస్తము- కరుణా హస్తము
కృపా హస్తము - యెహోవా హస్తము
1. మహా జలరాశుల నుండి - లేవ నెత్తెను...
జ్యేష్టనిగా ఎంచెను - ఉన్నతుని గా చేసేను..
నా చేయి ఎడతెగక - తోడుండి నని చెప్పి...
దావీదును బలపరిచి -బలాద్యునిగ మార్చేను
" దేవుని హస్తము"
2. సింహాసనం నుండి - గర్విష్టిలను పడద్రోసి...
దీనులను ఎక్కించి - ధన్యులుగా చేసేను
యాకోబు కొలిచే - పరాక్రమశాలి హస్తం
యోసేపుకు తోడుండి - శిఖరముపై నిలిపెను
" దేవుని హస్తము"
No comments:
Post a Comment