afclyrics, afcministry, christopher.afc

Sunday, December 31, 2023

2024 New Year Song || నీ దుఃఖ దినములు

AFC LYRICS

పల్లవి: నీ దుఃఖ దినములు 
సమాప్తమగునని
ప్రభువే సెలవిచ్చెను 
నీ అంగలార్పును నాట్యముగా మార్చి
ఆనందముతో నింపును 2T
నీ సూర్యుడిక అస్తమించడు
నీ చంద్రుడిక క్షీణించడు 2T
యెహోవాయే 3T
నీకు నిత్యమైన (వెలుగుగా ఉండును) 2T

1. వేదన వేదనయని - 
హేళన చేయు వారి మధ్యలో
మొరపెట్టిన యేబ్బేజు ప్రార్ధన 2T
తన సహోదరుల మధ్యలో
ఘనతను పొందునట్లుగా 2T
హెచ్చించెను ప్రభువే హెచ్చించెను 2T  " నీ దుఃఖ "

2. గొడ్రాలు గొడ్రాలని - 
నిందింపబడిన వారి వరసలో
కృప పొందిన - హన్నమ్మ ప్రార్ధన 2T
 దుఃఖమును మాన్పివేసి
సంతోషముగల తల్లిగా 2T
కృప పొందెను దైవ కృప పొందెను 2T " నీ దుఃఖ "                  

3. అన్నియు ప్రతికూలమని -
దుఃఖ సముద్రాణ మునిగిన
పోరాడి గెలిచిన - యాకోబు ప్రార్ధన 2T
ఇశ్రాయేలుగా మార్చెను
దైవాశీర్వాదము పొందెను 2T
దీవించెను ప్రభువే దీవించెను 2T        " నీ దుఃఖ "        
          



2024 New Year Song || నీ దుఃఖ దినములు

AFC LYRICS పల్లవి: నీ దుఃఖ దినములు  సమాప్తమగునని ప్రభువే సెలవిచ్చెను  నీ అంగలార్పును నాట్యముగా మార్చి ఆనందముతో నింపును 2T నీ సూర్యుడిక అస్తమ...