afclyrics, afcministry, christopher.afc

Wednesday, April 13, 2022

సిలువపై పలికిన ఏడు మాటలు // Seven Word's in the Cross

AFC LYRICS



సిలువపై పలికిన ఏడు మాటలు
మన ప్రభువైన యేసు క్రీస్తు – సిలువపై పలికిన ఏడు మాటలు

సిలువపై యేసు క్రీస్తు పలికిన 1 వ మాట: క్షమ సువార్త
లూకా 23:34 
యేసు –తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరినిక్షమించుమని చెప్పెను.
(సింహాసనం పైనుండి వచ్చిన క్షమాపణ కంటే సిలువ పైనుండి వచ్చిన క్షమాపణ గొప్పది)
వీరేమి చేయుచున్నారో వీరెరుగరు:
అవును, నిజంగానే వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగరు. ఆనాటి యూదులు ఎరగకచేసారు గనుక వారు ఆ క్షమాపణ పొందటానికి వారు అర్హులే. ఈనాటి క్రైస్తవులు అంతాఎరిగి, అంటే దేవుని ప్రేమను, ఆయన శక్తిని, 
ఆయన పరిశుద్ధతను అంతా ఎరిగి కూడాతమ క్రియల ద్వారా యేసు క్రీస్తును మరల సిలువ వేస్తున్నారు. పరిశుధ్ధాత్మకువ్యతిరేకంగా పాపాలు చేస్తూ, మరణకరమైన పాప కార్యాల్లో మునిగిపోతూ పరలోకపు తండ్రి
క్షమాపణకు దూరం అయిపోతున్నారు.
(A) వీరేమి చేయుచున్నారో వీరెరుగరు:
అపొ.కార్య3:13 అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మనపితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయననుఅప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల 
చేయుటకు నిశ్చయించినప్పుడు మీరుఅతనియెదుట ఆయనను నిరాకరించితిరి. 3:14 మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైనవాని నిరాకరించి, నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి.
3:15మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను;అందుకుమేము సాక్ష్యులము. 3:17 సహోదరులారా, మీరును మీ అధికారులునుతెలియక చేసితిరని నాకు తెలియును.
అపొ.కార్య 13:26 సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారలారా, యీ రక్షణ వాక్యము మనయొద్దకు పంపబడియున్నది. 13:27యెరూషలేములో కాపురముండువారును, వారి అధికారులును, ఆయననైనను, ప్రతివిశ్రాంతిదినమున చదవబడుచున్న ప్రవక్తల
వచనములనైనను గ్రహింపక, ఆయనకుశిక్ష విధించుటచేత ఆ వచనములను నెరవేర్చిరి.
యోహాను6:1 మీరు అభ్యంతరపడకుండవలెనని యీ మాటలు మీతోచెప్పుచున్నాను. 16:2 వారు మిమ్మును సమాజ మందిరములలో నుండివెలివేయుదురు; మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నాడనిఅనుకొను కాలము వచ్చుచున్నది. 16:3 వారు తండ్రిని నన్నును తెలిసికొనలేదుగనుక ఈలాగు చేయుదురు.
1కొరింథ 2:7 
దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానముమరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమనిమిత్తము నియమించెను. 2:8 అది లోకాధికారులలో ఎవనికిని
తెలియదు; అది వారికితెలిసియుండినయెడల మహిమా స్వరూపియుగు ప్రభువును సిలువవేయకపోయియుందురు.
లేవీ5:17 చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించినవాటిలో దేని నైనను చేసి ఒకడుపాపియైనయెడల అది పొరబాటున జరిగినను అతడు అపరాధియై తన దోషమునకుశిక్ష భరిం చును. 5:18 కావున నీవు
ఏర్పరచిన వెలచొప్పున మందలో నుండినిర్దోషమైన పొట్టేలును అపరాధపరిహారార్థబలిగా అతడు యాజకునియొద్దకుతీసికొనిరావలెను. అతడు తెలియకయే పొరబాటున చేసిన తప్పునుగూర్చి యాజకుడుఅతని
నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. 5:19 అదిఅపరాధపరిహారార్థబలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినదివాస్తవము.
1తిమోతి1:12 12-13. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైననన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్నుబలపరచిన మన ప్రభువైన క్రీస్తుయేసుకు
కృతజ్ఞుడనై యున్నాను. తెలియకఅవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.
(B) అన్నీ తెలిసి తప్పిపోయేవారి సంగతి ఏమిటి?
హెబ్రీ 6:4
ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రూచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై 6:5 దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగసంబంధమైన శక్తుల(ప్రభావమును) అనుభవించిన తరువాత 6:6 తప్పిపోయినవారు తమ విషయములోదేవుని కుమారుని మరల సిలువ వేయుచు, బాహాటముగా అవమానపరచుచున్నారుగనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.
హెబ్రీ10:26 మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాతబుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలియికను ఉండదు గాని10:27 న్యాయపుతీర్పుకు భయముతో
ఎదురుచూచుటయు, విరోధులనుదహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. 10:28 ఎవడైనను మోషేధర్మశాస్త్రమును నిరాకరించిన యెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద,కనికరింపకుండ వాని చంపించుదురు. 10:29 ఇట్లుండగా దేవుని కుమారుని,పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన 
రక్తమునుఅపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంతఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును?
2 పేతురు 2:20
వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైనఅనుభవజ్ఞానముచేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలవాటిలో చిక్కుబడి వాటిచేత జయింపబడినయెడల, వారి కడవరి
స్థితి మొదటి స్థితికంటెమరి చెడ్డదగును. 2:21 వారు నీతిమార్గమును అనుభవపూర్వకముగా తెలిసికొని,తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞనుండి తొలగిపోవుటకంటె ఆ మార్గముఅనుభవపూర్వకముగా
  తెలియకుండటయే వారికి మేలు. 2:22 కుక్క తన వాంతికితిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైనసామితె చొప్పున వీరికి సంభవించెను.
సిలువపై యేసు క్రీస్తు పలికిన 2 వ మాట: రక్షణ సువార్త
లూకా 23:42 
ఆయనను చూచి – యేసూ, నీవు నీ రాజ్యముతోవచ్చునప్పుడునన్ను జ్ఞాపకము చేసికొనుమనెను.
లూకా 23:43 
అందుకాయన వానితో – నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువనినిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను.
నెహెమ్యా 13:14
నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపకముంచుకొని, నా దేవునిమందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములనుమరువకుండుము.
2రాజులు20:1 ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన. .. . రోగముకలుగగా, ఆమోజు కుమారుడును ప్రవక్త యునైన యెషయా అతనియొద్దకు వచ్చినీవుమరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుమని యెహోవాసెలవిచ్చుచున్నాడని
చెప్పగా 20:2 అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని 20:3యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచు కొంటినో,నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో
  కృపతో జ్ఞాపకముచేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను.
పరదైసు అనేది ప్రభువు కృపకు పాత్రులైన వారు చనిపోయిన తరువాత వెళ్ళి నివసించేతాత్కాలిక పరలోకం. వారు తమ ప్రభువు తమకు ఇవ్వబోయే శాశ్వత పరలో్కానికి అంటేక్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అనబడే నిత్య
రాజ్యానికి చేరేంతవరకు పరదైసులోనే పరిశుధ్ధులసహవాసంలో పరమానంద భరితులుగా జీవిస్తూ ఉంటారు. ఈ పరదైసు భూమి క్రిందిభాగంలో ఉండేది. యేసు క్రీస్తు సిలువ మీద మరణించిన వెంటనే భూమి క్రింది భాగానికివెళ్ళి 
ఆ పరదైసును మధ్యాకాశంలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు.
ఎఫెసీ Eph 4:8 అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొనిపోయిమనుష్యులకు ఈవులను అనుగ్రహించెనని (ప్రవక్త) చెప్పియున్నాడు. 4:9ఆరోహణమాయెననగా ఆయన భూమియొక్క క్రింది భాగములకు
దిగెననియుఅర్థమిచ్చుచున్నది గదా. 4:10 దిగినవాడు తానే సమస్తమును నింపునట్లుఆకాశమండలములన్నిటికంటె మరి పైకి ఆరోహణమైనవాడునై యున్నాడు.
ఎఫెసీ 2:4- 5.
అయినను దేవుడు కరుణాసంపన్నుడైయుండి, మనము మనఅపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సహా, మనయెడల చూపిన తనమహాప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను. కృప చేతనే మీరు
రక్షింపబడియున్నారు. 2:6 క్రీస్తుయేసునందు ఆయన మనకుచేసిన ఉపకారముద్వారాఅత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవుయుగములలో కనుపరచు నిమిత్తము, 2:7 క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందుఆయనతోకూడ కూర్చుండబెట్టెను.
ఫిలిప్పీ3:20 
మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడినుండి ప్రభువైనయేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.
కొలొస్సీ3:1 మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. 3:2 -3. పైనున్నవాటిమీదనే గానిభూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి;
ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీజీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది.
హెబ్రీ12:22 ఇప్పుడైతే సీమోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు,అనగా పరలోకపు యెరూషలేముకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును, 12:23పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘమునకును,
వారిమహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవునియొద్దకును, సంపూర్ణసిద్ధిపొందిన నీతిమంతుల ఆత్మలయొద్దకును, 12:24 క్రొత్తనిబంధనకు మధ్యవర్తియైనయేసునొద్దకును, హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు
ప్రోక్షణ రక్తమునకును మీరువచ్చియున్నారు.
సిలువపై యేసు క్రీస్తు పలికిన 3 వ మాట: రాజ్య సువార్త
యోహాను19:26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరనిలుచుండుట చూచి -అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను; 19:27తరువాత శిష్యుని చూచి – యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడుఆమెను తన యింట చేర్చుకొనెను.
యేసు క్రీస్తు రాజ్యంలో చేరేవారంతా యేసు రక్త సంబంధులు. లోక సంబంధమైనరక్తసంబంధం తాత్కాలికమైనది, బలహీనమైనది. యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచేవారంతాఆయన రాజ్య సంబంధులై ఉంటారు కాబట్టి వారి మధ్య 
ఉండే యేసు రక్త సంబంధంశాశ్వతమైనది, బహు బలమైనది.
ఎఫెసీ3:14 ఈ హేతువుచేత పరలోకమునందును భూమిమీదను ఉన్న ప్రతికుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేనుమోకాళ్లూని… ప్రార్థించుచున్నాను.
1కొరింథీ2:12 ఏలాగు శరీరము ఏకమై యున్నను అనేకమైన అవయవములుకలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్క శరీరమై యున్నవో,
ఆలాగే క్రీస్తు ఉన్నాడు. 12:13 ఏలాగనగా,యూదులమైనను హెల్లేనీయులమైనను, దాసులమైనను స్వతంత్రులమైనను, మన మందరము ఒక్క శరీరముగా ఉండుటకు ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి.మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి.
1తిమోతి5:1 వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. 5:2అన్నదమ్ములని యౌవనస్థులను, తల్లులని వృద్ధస్త్రీలను అక్కచెల్లెండ్లనిపూర్ణపవిత్రతతో యౌవనస్త్రీలను హెచ్చరించుము.
గలతీ6:2 ఒకని భారములనొకడు భరించి యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగానెరవేర్చుడి.
ఫిలేమోను1:10 8-10. కావున యుక్తమైనదానిగూర్చి నీకాజ్ఞాపించుటకుక్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగియున్నను, వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తుయేసుఖైదినైయున్న పౌలను నేను ప్రేమనుబట్టి వేడుకొనుట మరి 
మంచిదనుకొని, నాబంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్నువేడుకొనుచున్నాను.
యెషయా58:7 నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికిముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు58:8 వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము
లిచ్చుటయు ఇదియే గదానాకిష్టమైన ఉపవాసము?
సిలువపై యేసు క్రీస్తు పలికిన 4 వ మాట: శ్రమ సువార్త
మత్తయి7:46 ఇంచుమించు మూడుగంటలప్పుడు యేసు – ఏలీ ఏలీ లామాసబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యివిడిచితివని అర్థము.
కీర్తన2:1 నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నాఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు?
(క్రీస్తు ఈ భూమి మీద మానవ జన్మ ధరించడానికి ఇంకా సుమారు వెయ్యి సంవత్సరాలకాలం ఉన్నపుడే ఈ ప్రవచనం ఇవ్వబడింది. అది అక్షరాలా నెరవేరింది.)
విలాప3:31 ప్రభువు సర్వకాలము విడనాడడు. 3:32 ఆయన బాధపెట్టినను తనకృపాసమృద్ధినిబట్టి జాలి పడును. 3:33 హృదయ పూర్వకముగా ఆయన నరులకువిచారము నైనను బాధనైనను కలుగజేయడు.
హెబ్రీ12:7 శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడుకుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? 12:8కుమాళ్లయినవారందరు శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందనియెడలదుర్బీజులేగాని కుమారులుగారు. 12:9 మరియు శరీరసంబంధులైన తండ్రులు మనకుశిక్షకులై యుండిరి వారియందు భయభక్తులు కలిగియుంటిమి; అట్లయితే ఆత్మలకుతండ్రియైనవానికి
మరిఎక్కువగా లోబడి బ్రదుకవలెను గదా? 12:10 వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టమువచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తనపరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించుచున్నాడు. 
12:11మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగానిసంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అదినీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.
యెషయా3:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మనవ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలనబాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి.
53:5 మనయతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టినలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందినదెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది. 53:6
మనమందరము గొఱ్ఱలవలె త్రోవతప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరిదోషమును అతనిమీద మోపెను.
మార్కు 14:50 అప్పడు వారందరు ఆయనను విడిచి పారిపోయిరి.
యోహాను8:29 నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైనకార్యము నేనెల్లప్పుడును చేయువాడను గనుక ఆయన నన్ను ఒంటిగావిడిచిపెట్టలేదని చెప్పెను.
Wear the Cross – Bear the Crown
సిలువను భరించు – కిరీటాన్ని ధరించు
No Cross – No Crown
సిలువ (శ్రమలు) నాకొద్దంటే కిరీటం కూడా నాకొద్దన్నట్లే
సిలువపై యేసు క్రీస్తు పలికిన 5 వ మాట: సజీవ సువార్త
యోహాను9:28 అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసుఎరిగి లేఖనము నెరవేరునట్లు – నేను దప్పిగొనుచున్నాననెను.
సజీవంగా ఉన్నవారే దాహం అని అంటారు గాని, చనిపోయిన వారు దాహం అని అనరు.సజీవంగా ఉన్న మనిషికి ఆకలి కలగని పరిస్థితి ఉంటుంది గానీ, దాహం కలగని పరిస్థితి ఉండదు.
కీర్తన2:1 దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణముఆశపడుచున్నది. 42:2 నా ప్రాణము దేవునికొరకు తృష్ణ గొనుచున్నది జీవము గలదేవునికొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? 
ఆయనసన్నిధిని నేనెప్పుడు కనబడెదను?
కీర్తన3:1 దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును 63:2 నీబలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయ మందు నేనెంతో ఆశతోనీతట్టు కని పెట్టియున్నాను. నీళ్లు లేక యెండియున్న దేశమందు నా ప్రాణమునీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరముకృశించుచున్నది.
యోహాను7:37 ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి –ఎవడైన దప్పిగొనిన యెడల నాయెద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. 7:38నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టువాని కడుపులోనుండి
జీవజలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. 7:39 తనయందు విశ్వాసముంచువారుపొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకమహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.
యెషయా5:1 దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి రూకలులేనివారలారా,మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియునియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. 55:2 ఆహారము కానిదానికొరకు
మీ రేలరూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును ఎందుకువ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీప్రాణముసారమైనదానియందు సుఖింపనియ్యుడి.
దాహం అంటే ఏమిటో యేసు క్రీస్తుకు తెలుసు కాబట్టి ఆయనే మన ఆత్మీయ దాహాన్నితీర్చగలడు.
యోహాను4:7 సమరైయ స్త్రీ యెకతె నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు –నాకు దాహమునకిమ్మని ఆమెనడిగెను.
సిలువపై యేసు క్రీస్తు పలికిన 6 వ మాట: విజయ సువార్త లేక సంపూర్ణసువార్త
యోహాను9:30 యేసు ఆ చిరక పుచ్చుకొని -సమాప్తమైనదని చెప్పి తల వంచిఆత్మను అప్పగించెను.
రోమా10:4 విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకుసమాప్తియైయున్నాడు. (It is finished! ఇది ఒక విజయ నినాదం)
కొలొస్సీ2:13 13-15. మరియు అపరాధములవలనను, శరీరమందుసున్నతిపొందకయుండుటవలనను, మీరు మృతులైయుండగా దేవుడు విధిరూపకమైనఆజ్ఞలవలన మనమీద రుణముగాను
మనకు విరోధముగానుండిన పత్రమునుమేకులతో
సిలువకు కొట్టి, దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండదానిని ఎత్తివేసి, మన అపరాధములనన్నిటిని క్షమించి ఆయనతోకూడ మిమ్మునుజీవింపచేసెను; 
ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి,సిలువచేత
జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా (వేడుకకు)కనుపరచెను.
2తిమోతి4:7 మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని,విశ్వాసము కాపాడుకొంటిని.
హెబ్రీ9:26 అట్లయినయెడల జగత్తు పునాదివేయబడినది మొదలుకొని ఆయనఅనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే యుగముల సమాప్తియందుతన్నుతానే బలిగా
అర్పించుకొనుటవలన పాపనివారణచేయుటకై యొక్కసారే ప్రత్యక్ష పరచబడెను.
ప్రసంగి Ecc 7:8 కార్యారంభముకంటె కార్యాంతము మేలు;
Race was run – Duty done – Victory won
సిలువపై యేసు క్రీస్తు పలికిన 7 వ మాట:నిత్య సువార్త
లూకా3:46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి – తండ్రీ, నీ చేతికి నాఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను.
ఆది2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.
యోబుJob 27:2 నా ఊపిరి యింకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియుదేవునిఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టియు…
సామెతలు Pro 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగము లన్నియు శోధించును.
1 థెస్స 1Th 5:19 ఆత్మను ఆర్పకుడి.
1కొరింథీ6:19 మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్నపరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా?
1కొరింథీ3:16 మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలోనివసించుచున్నాడనియు మీరెరుగరా?
1పేతురు4:19 కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్ ప్రవర్తనగలవారై,నమ్మకమైన సృష్టకర్తకు తమ ఆత్మలను అప్పగించు కొనవలెను.



2024 New Year Song || నీ దుఃఖ దినములు

AFC LYRICS పల్లవి: నీ దుఃఖ దినములు  సమాప్తమగునని ప్రభువే సెలవిచ్చెను  నీ అంగలార్పును నాట్యముగా మార్చి ఆనందముతో నింపును 2T నీ సూర్యుడిక అస్తమ...