Thursday, February 17, 2022

AFC Songs

 AFC LYRICS

నీవే కృపాదారము త్రియేక దేవా | Nevey Krupadaramu song lyrics

AFC LYRICS

నీవే కృపాదారము త్రియేక దేవా
నీవే క్షేమాదారము నా యేసయ్య } 2
నూతన బలమును నవనూతన కృపను } 2
నేటి వరకు దయచేయుచున్నావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే కృపాదారము ||

ఆనందించితిని అనురాగబంధాల
ఆశ్రయపురమైన నీలో నేను } 2
ఆకర్షించితిని ఆకాశముకంటే
ఉన్నతమైననీ ప్రేమను చూపి } 2
ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి
ఆవేదనల అగ్నిజ్వాలలో అండగానిలచితివి
ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా
ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే కృపాదారము ||

సర్వకృపానిధి సీయోను పురవాసి
నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి } 2
సిలువను మోయుచు నీ చిత్తమును
నెరవేర్చెదను సహనముకలిగి } 2
శిధిలముకానీ సంపదలెన్నో నాకైదాచితివీ
సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి
సర్వశక్తిగల దేవుడవై నడిపించుచునావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే కృపాదారము ||

ప్రాకారములను దాటించితివి
ప్రార్థన వినెడి పావనమూర్తివి } 2
పరిశుద్దులతో నన్ను నిలిపితివి
నీ కార్యములను నూతన పరచి } 2
పావనమైన జీవనయాత్రలో విజయము నిచ్చితివి
పరమ రాజ్యమును నిలుపుట కొరకు అభిషేకించితివి
పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే కృపాదారము |

Wednesday, February 16, 2022

నిజమైన ద్రాక్షావళ్లి నీవే | Nijamaina Draskhavalli Nevey song lyrics

AFC LYRICS
నిజమైన ద్రాక్షావళ్లి నీవే
నిత్యమైన సంతోషము నీతోనే
శాశ్వతమైనది ఎంతో మధురమైందీ
నాపైన నీకున్నప్రేమ - ఎనలేని నీప్రేమ

అతికాంక్షనీయుడా దివ్యమైన నీరూపులో
జీవించుచున్నాను నీప్రేమకు నే పత్రికగా
శిథిలమైయుండగా నన్ను నీదురక్తముతో కడిగి
నీ పొలికగా మార్చినావే నా యేసయ్య

నిజమైన ద్రాక్షావళ్లి నీవే
నిత్యమైన సంతోషము నీతోనే
శాశ్వతమైనది ఎంతో మధురమైందీ
నాపైన నీకున్నప్రేమ - ఎనలేని నీప్రేమ

నా ప్రాణాప్రియుడా శ్రేష్ఠమైన ఫలములతో
అర్పించుచున్నాను సర్వమునీకే అర్పణగా
వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు
జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్య

నిజమైన ద్రాక్షావళ్లి నీవే
నిత్యమైన సంతోషము నీతోనే
శాశ్వతమైనది ఎంతో మధురమైందీ
నాపైన నీకున్నప్రేమ - ఎనలేని నీప్రేమ

శాలేమురాజ రమ్యమైన సీయోనుకే
నను నడిపించుము నీచిత్తమైన మార్గములో
అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి
ఆధారణకర్తవై నను చేర్చుము నీ రాజ్యములో

నిజమైన ద్రాక్షావళ్లి నీవే
నిత్యమైన సంతోషము నీతోనే
శాశ్వతమైనది ఎంతో మధురమైందీ
నాపైన నీకున్నప్రేమ - ఎనలేని నీప్రేమ

AFC MANNA


AFC LYRICS

Friday, February 11, 2022

దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా | Dhinuda ajeyuda song lyrics

https://afclyrics.blogspot.com/


పల్లవి : దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా
పూజ్యుడా పరిపూర్ణుడా - ఆనంద నిలయమా
జీవదాతవు నీవని శృతిమించి పాడనా 
జీవధారవు నీవని కానుకనై పూజించనా
 అక్షయ దీపము నీవే - నా రక్షణ శృంగము నీవే 
స్వరార్చనచేసెద నీకే - నా స్తుతులర్పించెద నీకే 

1 : సమ్మతిలేని సుడిగుండాలు - ఆవరించగా 
గమనములేని పోరాటాలే - 
తరుముచుండగా నిరుపేదనైనా నా యెడల 
- సందేహమేమీ లేకుండా 
హేతువేలేని-ప్రేమచూపించి -
సిలువచాటునే దాచావు 
సంతోషము నీవే - అమృత సంగీతము నీవే 
స్తుతిమాలిక నీకే - వజ్రసంకల్పము నీవే            "దీనుడా "

2 : సత్య ప్రమాణము నెరవేర్చుటకే - మార్గదర్శీవై 
నిత్యనిబంధన నాతోచేసిన - సత్యవంతుడా
విరిగి నలిగినా మనస్సుతో - హృదయార్చనే చేసెద 
కరుణనీడలో - కృపావాడలో - నీతోవుంటే చాలయ్య
కర్తవ్యము నీవే - కనుల పండుగ నీవేగా 
 విశ్వాసము నీవే - విజేయశిఖరము నీవేగా      " దీనుడా "

3 : ఊహకందని ఉన్నతమైనది - దివ్యనగరమే 
స్ఫటికము పోలిన సుందరమైనది -  నీరాజ్యమే
ఆ నగరమే లక్షమై - మహిమాత్మతో నింపినావు 
అమరలోకానా - నీ సన్నిధిలో - క్రొత్త కీర్తనేపాడెదను 
 ఉత్సహము నీవే - నయన్తోత్సవము నీవేగా 
ఉల్లసము నీలో - ఊహాలపల్లకి నీవేగా            " దీనుడా "

స్తుతి పాడుటకే బ్రతికించిన | Stuti Paduta key bratikinchina



పల్లవి:  స్తుతి పాడుటకే బ్రతికించిన

 జీవనదాతవు నీవేనయ్యా

         ఇన్నాళ్లుగా నన్ను పోషించినా

         తల్లివలె నన్ను ఓదార్చినా

         నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా  - 2

          జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా

         నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును




  1 . ప్రాణభయమును తొలగించినావు

         ప్రాకారములను స్థాపించినావు

                        సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు  -2

         నీ కృపా బాహుళ్యమే-వీడని అనుబంధమై

                        తలచిన ప్రతిక్షణమున-నూతన బలమిచ్చెను  ||  స్తుతి ॥




  2 . నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు

    కనుమరుగాయెను నా దుఖ:దినములు

                కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు -2 

     నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై

                   నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను.  ॥ స్తుతి ॥




   3. హేతువులేకయే ప్రేమించినావు

       వేడుకగా ఇల నను మార్చినావు

       కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు -2

       నీ ప్రేమ మాధుర్యమే- నా నోట స్తుతిగానమై

                            నిలిచిన ప్రతిస్థలమున -పారెను సెలయేరులై          ॥ స్తుతి ॥

దయాకిరీటం అనుగ్రహ సంవత్సరం 2025 New Year Song

AFC LYRICS దయాకిరీటం అనుగ్రహ సంవత్సరం 2025 New Year Song  పల్లవి: దేవా దయా కిరీటం మా శిరస్సుపై - ధరియింపుమా! సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వ...