Saturday, February 12, 2022
Friday, February 11, 2022
దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా | Dhinuda ajeyuda song lyrics
https://afclyrics.blogspot.com/పల్లవి : దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమాపూజ్యుడా పరిపూర్ణుడా - ఆనంద నిలయమాజీవదాతవు నీవని శృతిమించి పాడనాజీవధారవు నీవని కానుకనై పూజించనాఅక్షయ దీపము నీవే - నా రక్షణ శృంగము నీవేస్వరార్చనచేసెద నీకే - నా స్తుతులర్పించెద నీకే1 : సమ్మతిలేని సుడిగుండాలు - ఆవరించగాగమనములేని పోరాటాలే -తరుముచుండగా నిరుపేదనైనా నా యెడల- సందేహమేమీ లేకుండాహేతువేలేని-ప్రేమచూపించి -సిలువచాటునే దాచావుసంతోషము నీవే - అమృత సంగీతము నీవేస్తుతిమాలిక నీకే - వజ్రసంకల్పము నీవే "దీనుడా "2 : సత్య ప్రమాణము నెరవేర్చుటకే - మార్గదర్శీవైనిత్యనిబంధన నాతోచేసిన - సత్యవంతుడావిరిగి నలిగినా మనస్సుతో - హృదయార్చనే చేసెదకరుణనీడలో - కృపావాడలో - నీతోవుంటే చాలయ్యకర్తవ్యము నీవే - కనుల పండుగ నీవేగావిశ్వాసము నీవే - విజేయశిఖరము నీవేగా " దీనుడా "3 : ఊహకందని ఉన్నతమైనది - దివ్యనగరమేస్ఫటికము పోలిన సుందరమైనది - నీరాజ్యమేఆ నగరమే లక్షమై - మహిమాత్మతో నింపినావుఅమరలోకానా - నీ సన్నిధిలో - క్రొత్త కీర్తనేపాడెదనుఉత్సహము నీవే - నయన్తోత్సవము నీవేగాఉల్లసము నీలో - ఊహాలపల్లకి నీవేగా " దీనుడా "
స్తుతి పాడుటకే బ్రతికించిన | Stuti Paduta key bratikinchina
Monday, February 7, 2022
ముఖ దర్శనం చాలయ్యా సాంగ్ | Mukha Darshnam Chalayya Song lyrics
Thursday, February 3, 2022
బైబిల్ లో కొన్ని పేర్లకు అర్థాలు
⭐⭐⭐⭐⭐⭐⭐
బైబిల్ లో కొన్ని పేర్లకు అర్థాలు
📎ఆదాము - ఎఱ్ఱనివాడు, నిర్మింపబడినవాడు.
📎అబ్రాము - గౌరవనీయుడగు తండ్రి.
📎హానోకు - ప్రతిష్టింపబడినవాడు.
📎నోవాహు - నెమ్మది
📎ఇస్సాకు- నవ్వు.
📎యాకోబు-మోసపుచ్చు
వాడు.
📎కయీను -పొందుట;
📎హేబేలు-ఆవిరి.
📎ఏసావు-వెంట్రుకలు గలవాడు.
📎యోసేపు-అభివృద్ధి ;
📎షెతు-బదులుగా ఇవ్వబడినవాడు;
📎అబ్రహాము- అనేక జనములకు తండ్రి.
📎బయర్షెబా -ప్రమాణపు బావి.
📎బేతేలు-దేవుని ఇల్లు;
📎హెబ్రోను -సహవాసం.
📎హవ్వ -జీవము
📎లేయ -అడవి ఆవు.
📎రాహేలు -ఆడగొర్రె;
📎శారాయి-జగడగొండి; శారా-రాజమారి
📎రిబ్కా- ఉచ్చుతాడు
📎దీనా -న్యాయపు తీర్పు
📎తామారు-ఈతచెట్టు.
📎షేము- పేరు,నామము;
📎హాము-అల్లకల్లోలం, నల్లనివాడు;
📎హాగరు-యాత్రికురాలు,సంచరించుట.
📎మెల్కిసేదెకు-నీతిరాజు,
📎షాలేము యాజకుడైన రాజు;
📎మెతూషెల -ఈటే గలవాడు.
📎ఎఫ్రాయిము-రెండంతలువృద్ధి, ఫలము
📎ఎఫ్రాతా -ఫలవంతమైన స్థలం.
📎ఏదేను- ఉల్లాసము;
📎నిమ్రోదు- తిరుగుబాటు, దైవ ద్రోహి.
📎ఎనోషు- మానవుడు;
📎బాబేలు- గందరగోళం.
📎మోషే -నీటి నుండి రక్షించబడినవాడు.
📎అహరోను - కాంతిగల.
📎మిర్యాము - తిరుగుబాటు.
📎అమ్రాము - అనుభవం లేనివాడు.
📎యోకేబేదు - యెహోవా మహాత్యముగలవాడు.
📎సిప్పోరా - పిచ్చుక.
📎రఘుయేలు - ప్రియుడు.
📎గెర్షోము - పరదేశి.
📎మార - చేదు.
📎మన్నా - ఇది ఏమిటి (దివ్యమైనఆహారము).
📎యెహోవా నిస్సి - ధ్వజము.
📎ఎలియేజరు - దేవసహాయం.
📎మస్సా - శోధించుట.
📎మోరిభా - వాదాము.
📎బెసలేలు - దేవుని నీడలో
📎నాదాబు- దాతృత్వం గలవాడు, ఇష్టపూర్వకంగా ఇచ్చువాడు.
📎అభిహూ - ఆయనే నా తండ్రి.
📎యాజకులు - దేవునికి ప్రజలకు మధ్య వర్తి.
📎అహరోను - వెలుగునిచ్చు వాడు.
📎అభిరాము - తండ్రి హెచ్చించబడును, ఉన్నతమైనతండ్రి.
📎కాలేబు - కుక్క
📎కాదేషు బర్నెయా - ప్రతిష్టితము
📎అహరోను - కాంతిగల
📎అబీరాము - తండ్రి హెచ్చించబడును
📎అరామీ దేశము - సిరియా దేశము
📎సీనాయి (హోరేబు) - చంద్ర దేవతకు సంబంధించినది
📎యెహోషువా - యెహోవాయే రక్షణ
📎రహాబు - విశాలత లేక గర్వము
📎ఆకాను - ప్రజలను బాదించువాడు
📎ఆకోరులోయ - బాధలోయ
📎షీలోహు - నెమ్మది లేక శాంతి
📎కెదెషు - పరిశుద్ధమైనది
📎షెకెము - బుజము
📎హెబ్రోను - సహవాసము
📎బేసెరు - దుర్గము (లేక) యుద్ధముయొక్క బలములు
📎రామోతు - ఉన్నత స్థలము
📎గోలాను - చుట్టు ప్రదేశము, ఆనందము
📎హోర్మా - నిషిద్ధపట్టణము
📎బెతేమెష్ - సూర్యనివాసము
📎ఒత్నీయేలు - దేవుని సింహము
📎కిర్యత్సేఫెరు - గ్రంథనగరము
📎ఆరాము - ఎత్తైనస్థలము
📎కూషున్రిషాతాయిము - రెట్టింపు దుర్మార్గపు చీకటి
📎కెనజు - దేవుని శక్తిమీద ఆధారపడిన వ్యక్తి
📎ఎలీమెలేకు - దేవుడే నా రాజు
📎బెత్లెహేము - రొట్టెల ఇల్లు
📎మోయాబు - నా తండ్రి నుండి
📎మహ్లోనూ - వ్యాధిగ్రస్తుడు
📎కిల్యోను - క్షీణించుచున్న
📎ఓర్పా - మెడ వంచని లేక జడలు గలది
📎రూతు - సంతృప్తి లేక స్నేహము
📎నయోమి - మధురమైన
📎మారా - చేదు
📎బోయజు - బలవంతుడు
📎ఓబేదు - సేవకుడు
📎ఎల్కానా - దేవుడు సృజించెను
📎హన్నా - కృప
📎పెనిన్నా - పగడము
📎సమూయేలు - దేవుని అడిగితిని, దేవుడు వినెను
📎ఎలీ - ఎత్తు
📎హోఫ్నీ - పిడికిలి సంబంధించిన
📎సౌలు - దేవునివలన అనుగ్రహింపబడినవాడు
📎షీలోహు - నెమ్మది లేక విశ్రాంతి
📎ఈకాబోదు - ప్రభావము పోయెను
📎మిస్పా - కావాలి గోపురము
📎మత్తయి- యెహోవా దానము
📎యేసు- రక్షకుడు
📎క్రేస్తు- అభిషక్తుడు
📎యోసేపు- కూడబెట్టుట
📎మరియ- చేదు, తిరుగుబాటు
📎హేరోదు- శూరుడు
📎యోహాను- యెహోవాకృప
📎పరిసయ్యులు- ప్రత్యేకింపబడినవారు
📎సద్దుకయులు- నీతిమంతులు
📎బెత్సయిదా- వలలస్థలము
📎ఫిలిప్పి- ఆశ్రయప్రియుడు, గుఱ్ఱములను ప్రేమించువాడు
📎హీరోదియా- శూరురాలు
📎గలిలయ- గుండ్రని వలయము
📎ఒలివకొండ- వనము
📎బరబ్బా- తండ్రియొక్క కుమారుడు
📎గోల్గోత- కాపాల స్థలము.
📎యేసు - రక్షకుడు
📎మార్కు - మాదిరి
📎పిలాతు - క్రీస్తును సిలువవేసినవాడు
📎హేరోదు - శూరుడు
📎దెకపొలి - 10 పట్టణాలు
📎బోయనెర్గెసు - ఉరిమెడివారు
📎తలితాకుమి - చిన్నదానలెమ్ము
📎బేతనియ - బీదలనివాసము, ఖర్జూరపుపండ్లఉనికి
📎నజరేతు - చిగురు, రక్షించును
📎యెరికో - సువాసనగలస్థలము
📎బెత్లెహేము - రొట్టెలఇల్లు
📎కైసరు - రోమా చక్రవర్తుల ఉద్యోగ బిరుదు
📎లాజరు - దేవుడే నా సహాయము
📎జెకర్యా - యెహోవా స్మరించుము
📎ఎలిసబెతు - దేవుని ప్రమాణము
📎అన్న - కృప, దయ
📎ఫిలిప్పు - అశ్వ ప్రియుడు
📎మరియ - మిర్యాము అను హెబ్రీపదము యొక్క 📎గ్రీకురూపము (కన్యయైన మరియ)
📎మార్తా - ఇల్లాలు
📎యోహాను - యెహోవా కృపగలవాడు
📎మెసయ్య - అభిషిక్తుడు
📎కేఫా - రాయి
📎నికోదెము - ప్రజలను జయించువాడు
📎సమరయ - కావలి
📎కోసెడు దూరం - మూడు కిలోమీటర్లు
📎మార్తా - ఇల్లాలు
📎యూదా - స్తుతించుట
📎పేతురు - బండ
📎ఆదరణకర్త - ఉత్తరవాది
📎కయప - నొక్కు
📎షాలోమ్ - మీకు సమాధానం కలుగును గాక
📎తోమా - కవలవాడు
Sthuthi Paadutake Brathikinchina Telugu Song Lyrics | స్తుతి పాడుటకే బ్రతికించిన
పల్లవి: స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా
ఇన్నాళ్లుగా నన్ను పోషించినా
తల్లివలె నన్ను ఓదార్చినా
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా - 2
జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా
నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును
1. ప్రాణభయమును తొలగించినావు
ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప
దీర్ఘాయువుతో నను నింపినావు -2
నీ కృపా బాహుళ్యమే-వీడని అనుబంధమై
తలచిన ప్రతిక్షణమున-నూతన బలమిచ్చెను || స్తుతి ॥
2 . నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు
కనుమరుగాయెను నా దుఖ:దినములు
కృపలనుపొంది నీ కాడి మోయుటకు
లోకములోనుండి ఏర్పరచినావు -2
నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై
నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. ॥ స్తుతి ॥
3. హేతువులేకయే ప్రేమించినావు
వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు
నా చేయి విడువక నడిపించినావు -2
నీ ప్రేమ మాధుర్యమే- నా నోట స్తుతిగానమై
నిలిచిన ప్రతిస్థలమున -పారెను సెలయేరులై ॥ స్తుతి ॥
దయాకిరీటం అనుగ్రహ సంవత్సరం 2025 New Year Song
AFC LYRICS దయాకిరీటం అనుగ్రహ సంవత్సరం 2025 New Year Song పల్లవి: దేవా దయా కిరీటం మా శిరస్సుపై - ధరియింపుమా! సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వ...
-
AFC LYRICS దయాకిరీటం అనుగ్రహ సంవత్సరం 2025 New Year Song పల్లవి: దేవా దయా కిరీటం మా శిరస్సుపై - ధరియింపుమా! సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వ...
-
AFC LYRICS నిజమైన ద్రాక్షావళ్లి నీవే నిత్యమైన సంతోషము నీతోనే శాశ్వతమైనది ఎంతో మధురమైందీ నాపైన నీకున్నప్రేమ - ఎనలేని నీప్రేమ అతికాంక్షనీయుడా ...
-
https://afclyrics.blogspot.com/ పల్లవి : దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా - ఆనంద నిలయమా జీవదాతవు నీవని శృతిమించి పాడనా జీవ...