దయాకిరీటం అనుగ్రహ సంవత్సరం 2025
New Year Song
పల్లవి: దేవా దయా కిరీటం
మా శిరస్సుపై - ధరియింపుమా!
సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు 2T
నీ దయతో మమ్మును కాపాడుమా..
దయ చూపి - దారి - చూపించుమా...
" దేవా "
1. భద్రపరచి - బ్రతుకు నిచ్చేది
నీ దయా మాత్రమే...
కోడి రెక్కలతో - పిల్లలను దాచునట్లు
కేడముతో కప్పి - కాపాడుమా! .
" నీ దయతో "
2. క్షమించి నడిపించి - నేర్పునిచ్చేది
నీ దయా మాత్రమే ...
తొట్రిల్లనీయక - క్షేమ ప్రదేశమందు
దయగల ఆత్మతో - నడిపించుమా...
" నీ దయతో "
3. కరుణా కటాక్షంతో-హెచ్చింపునిచ్చేది
నీ దయా మాత్రమే ...
స్థిరపరచి బలపరచి - కుడిపార్శమందు
రాకడలో మమ్మును నిలబెట్టుమా...
" నీ దయతో "