afclyrics, afcministry, christopher.afc

Monday, January 2, 2023

ఎడబాయని నా దేవుడా!.. 2023 AFC New Year Song

AFC LYRICS

పల్లవి:- ఎడబాయని నా దేవుడా!..
నన్ను మరువని నా తండ్రివి...
నీకేమి చెల్లింతునూ 
నీ రుణమెల నే తీర్చేదా?..
నా జీవితకాలమంతా నీ సాక్షిగా నే బ్రతికేదా "2T"
     
అ.ప:- విడువను ఎడబాయను నని
           వాగ్దానము చేసిన నా దేవుడా!..

1. గాఢాంధకారము లోన...
కష్టాలు కొలిమిలోన...
అగ్ని వంటి శ్రమలోనా...
అరణ్య యాత్రలోన... 2T
నీవు నాతో ఉండి - నన్ను ఎడబాయక
బలపరిచి స్థిరపరిచి నా దేవుడా!.. 2T
                                                 " విడువను "
2. నేనెరుగని మార్గమందూ...
నడిపించిన నజరేయుడా...
గ్రుడ్డివారిని చేయి పట్టి
నడిపించిన రీతిలో... 2T
ఆత్మతో నింపి - నూతన మార్గంలో
నీ రాకకై - సిద్ధపరచిన దేవా!.. 2T
                                                  " విడువను "

Monday, July 4, 2022

PRAY 🙏 FASTING ఉపవాస ప్రార్థన

AFC LYRICS




ఉపవాస ప్రార్థన  : దయచేసి ఈ వర్తమానమును వాట్సాప్ ఫేసుబుక్స్ లలో షేర్ చెయ్యండి  
కొంతమంది  ఫోన్ ఉపవాసము (ఫోన్ వాడకుండా),  లేదా టీ.వీ ఉపవాసము  (టీ.వీ వాడకుండా)  , పని చెయ్యకుండా , ఎవ్వరితో మాట్లాడకుండా , ఎక్కడికి వెళ్లకుండా   ఉపవాసము చేస్తున్నారు. అవన్నీ ఉపవాసాలలో భాగములే కానీ యేసుప్రభువు వారు చేసిన  ఉపవాసము  మాత్రము తినకుండా ఉపవాసము.   ఆ దినములలో ఆయన ఏమియు తినలేదు.  లూకా సువార్త (4 :2) 
ఉపవాసములో ఒక భాగము – "మనకు ఇష్టమైనది వదలుకొనుట”. 
ప్రతి రోజు  సాదారణముగా  అన్నింటి కంటే మనకు ఇష్టమైనది తిండి మాత్రమే.   
ఉపవాసములో ఒక భాగము – "మనకు ఇష్టమైనది వదలుకొనుట”.
1. ఉపవాసము వల్ల ఉపయోగాలు 
 
a.  అప్పుడు యేసు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్లెను ; లూకా సువార్త (4 :14) 
ఈ వచనమునకు ముందు  రాయబడినది కేవలము యేసుప్రభువు వారి ఉపవాసము గురించి   
యేసు ప్రభువు వారికి కూడా ఆత్మ బలము పొందుకోవాలంటే ఉపవాసము అవసరమైనది 
నీవు ప్రార్థన సరిగ్గా చేసికొనలేక పోవుచున్నావా ? లేదా వాక్యము సరిగ్గా చదవ లేక పోవుచున్నావా 
లేక విశ్వాసములో  సరిగ్గా నిలబడలేక పోవుచున్నావా అయితే నీకు పరిశుద్దాత్మ బలము కావాలి.
దానికి ఉపవాసము ఒక తేలికైన మార్గము.

b. క్రొవ్వంతయు యెహోవాదే ; అది సువాసనగల హోమ రూపమైన ఆహారము. లేవీయకాండము (3:16 )    ఉపవాసము ఉన్నప్పుడు  శరీరము  యొక్క  క్రొవ్వు కరుగుతుంది,  ఈ ప్రక్రియ, పై వాక్యము ప్రకారము దేవునికి సువాసన గల హోమముగా మారుతున్నది . ఇది దేవుణ్ణి సంతోషపరచే కార్యము అందుకే ఉపవాస  ప్రార్థన సాధారణ ప్రార్థన కన్నా శక్తివంతమైనది  

c.  బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటి వరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది , బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు . మత్తయి సువార్త (11 :12 )
 నిరాహార దీక్ష చేసేవారు ఆహారము మానివేసి బలవంతముగా ప్రభుత్వము నుండి ఉపయోగాలు పొందుకొంటారు. 
మన ఇంట్లో పిల్లలు ఒక్కోసారి వాళ్ళు అడిగినది ఇస్తేనే అన్నము తింటానని బలవంతము చేస్తారు. వాళ్లు అడిగినది ఇస్తానంటేనే లేదా ఇస్తేనే అన్నము తింటారు. 
అదే విధముగా మత్తయి సువార్త (11 :12 ) ప్రకారము పరలోక రాజ్యపు దీవెనలు కొన్ని రావాలంటే, కొన్ని ఆత్మలు మారుమనస్సు పొందాలంటే , ఆర్థికంగా అభివృద్ధి పొందాలంటే,  నీకున్న కఠినమైన సమస్యలు పోవాలంటే దీక్షతో బలవంతము అనగా  ఉపవాసము చేయవలసినదే.
అందుకాయన ప్రార్థనవలననే (ఉపవాసము వలననే) గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను.  మార్కు సువార్త (9:29) 
 
d.  ఉపవాసము మనిషి ఆయుర్దాయము పెంచుతుంది 

వైద్య శాస్త్ర నిపుణులు దీన్ని పరిశోధించి తెలిసికొన్నారు. మనిషి శరీరములో బలహీనమైన కణాలు మరియు బలవంతమైన కణాలు ఉంటాయి. బలహీన కణాలు ఉపవాస ప్రక్రియలో సరైన ఆహారము అందక చనిపోతాయి. బలమైన కణాలు ఇంకా ఆరోగ్యకరంగా ఉత్తేజముగా ఎక్కువ కాలము పని చేయడానికి ఇది ఉపయోగ పడుతుంది.
 వైద్య శాస్త్ర నిపుణులు  ఈ విధముగా చెబుతున్నారు. 
    (i)  ఈ రోజుల్లో ఎక్కువ  యువకుల్లో కూడా జబ్బులు రావడానికి కారణము తిండి లోపము కాదు కానీ తిండి ఎక్కువగా తినుట వలన మాత్రమే,  ఈ విధముగా అప్పుడప్పుడు ఉపవాసము చేయుట వలన అది సరి అవుతుంది . (Balance) 
   (ii) శరీరములో సున్నిత అవయవాలైన గుండె , లివర్ మొదలైన వాటి చుట్టూ  ఉన్న హానికరమైన క్రొవ్వు    కరుగుతుంది, 
    (iii) రక్త నాళంలో ఉన్న హానికరమైన ఉప్పు నిల్వలు కరిగి పోతాయి. 
    (iv) రక్తములో ఉన్న చెడు కొలెస్ట్రాల్  కరుగుతుంది.
(v) రక్తములో అధిక మోతాదులో ఉన్న షుగర్ కరుగుతుంది.



d. దేవుని యొద్దనుండి సంతోషము 

మనము ఎంత ద్రవాహారాలు తాగినా, మనము తినక పొతే  కడుపుకు తృప్తి అనేది ఉండదు. 
అంటే ఉపవాసము ఒక రకముగా దుఃఖ పరచుకొనుటకు సూచనగా ఉన్నది.  ఆ దినముల యందు దానియేలను నేను మూడు వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని.   దానియేలు (10:2)
ఉపవాసము ద్వారా  దుఃఖపరచుకొనుట వలన దేవుని యొద్ద నుండి సంతోషకరమైన దీవెన వస్తుంది 
 ఇదే law of Balance.   (Law of Balance -ఒకటి కోల్పోవుట వలన  మరొకటి వచ్చి తీరాలి)

e. పరలోకపు ఆహారము వస్తుంది 
ఉపవాసములో  భూ సంభందమైన ఆహారము మాని వేయుట వలన మనకు పరలోక సంభందమైన ఆహారము వస్తుంది.  ఇదే law of Balance. (Law of Balance -ఒకటి కోల్పోవుట వలన  మరొకటి వచ్చి తీరాలి)

కొంత మంది దైవ సేవకులు  లేదా విశ్వాసులు చాల పేద స్థితి లో  ఉంటారు. కొన్ని సందర్భాలలో వారికీ చాల రోజుల వరకు తినడానికి ఏమి ఉండదు. అంటే దాని అర్ధము "దేవుడు వారి ప్రార్థనలను ఆలకించుట లేదు అని కాదు, కానీ దేవుడు వారిని భవిషత్తులో గొప్ప సేవ జరిగేలా వారి శరీరాన్ని సిద్ధపరచుచున్నాడు, ఇది కూడా ఒక రకమైన ఉపవాసమే".  కొంతమంది  విశ్వాసులకు ఆశీర్వాదాలు  కళ్ళకు గంతలు కడతాయి.  ఆశీర్వాదాలు  వచ్చిన తర్వాత  కొంతమంది  సేవ లేదా విశ్వాస జీవితము మొదట ఉన్నంత హృదయ పూర్వకముగా ఉండదు. పైన చెప్పబడిన  కటిక లేమి లేదా ఉపవాసము  ద్వారా  దేవుడు వారిలో బలమైన విశ్వాసపు వేరు వ్య్యాపింపచేస్తాడు. దేవుడు గొప్ప గా  మిమ్ములను తన చాచిన చేతితో బాహుబలాలతో  ఆశీర్వదించిన తర్వాత  ఒకప్పటి కటిక లేమి స్థితి లేదా ఉపవాసము  ఒక సాక్షిగా నిలబడి నీవు దేవునికి ఇంకా ఎక్కువ  కృతజ్ఞత కలిగేలా నిన్ను తయారు చేస్తుంది. నీ సేవ లేదా విశ్వాస జీవితము పడిపోకుండా  నిలబడాలంటే ఉపవాసము చాల తేలికైన మార్గము. ఒక వేళ పడిపోయిన నీ సేవ లేదా పడిపోయిన నీ విశ్వాస  జీవితము మరల  నిలబడాలంటే   ఉపవాసము చాల తేలికైన మార్గము.  క్రమము తప్పకుండా చేసే ఉపవాస ప్రార్థనలు సాతాను సమూహాలను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. 
2. ఉపవాసము  ఎలా చేయాలి   

a. ఉపవాసము అలవాటులేని వారు ఎక్కువ రోజులు ఉండుట వలన నీరసించి పోతారు. కనుక  శరీరాన్ని క్రమముగా అలవాటు చేయాలి. అసలు అలవాటు లేని వారు మొదట ఒక పూట డిన్నర్ రాత్రి భోజనము మాని వేయుట , క్రమముగా ఇది రెండు రోజులు మూడు రోజులు రాత్రి భోజనము మాని వేయుట, ఆలా నీ యొక్క ప్రార్థనా భారాన్నిబట్టి  కొన్ని వారాలు లేదా నెలల తర్వాత నీ శరీరము అలవాటు అయ్యేకొద్దీ   రోజులు పెంచుకుంటూ  ఉపవాసము  చేయుటవలన మనము క్రమముగా ఆత్మ బలము పొందుకొంటాము.  
ఇలా  శరీరము  అలవాటు అయ్యే కొద్దీ  ఒక రోజంతా ఏమీ తినకుండా ఆలా క్రమ క్రమముగా రెండు మూడు సంపూర్ణ  రోజులు , ఆలా నీ యొక్క ప్రార్థనా భారాన్నిబట్టి  కొన్ని వారాలు లేదా నెలల తర్వాత నీ శరీరము అలవాటు అయ్యేకొద్దీ   రోజులు పెంచుకుంటూ ఉపవాసము  చేయుటవలన   క్రమముగా ఆత్మ బలము పొందుకొంటాము.   నిమ్మరసము ,  పళ్ళ లేదా కూరగాయల రసములు తీసికొని తిండి మాని వేయుట వలన మనము ప్రార్థనలో ఏకాగ్రతగా గడపవచ్చు . దేవుని కార్యాలు బలముగా చూడగలము. 
b. ఉపవాసమునకు ముందు సిద్ధపాటు కావాలి  
అలవాటు లేని వారు ఒకేసారి ఎక్కువ రోజులు ఉండటానికి  శరీరము సహకరించక పోవచ్చు.  ఉపవాసానికి  కొన్ని  రోజుల ముందు నుంచే దేవుని నడిపింపునకై , సిద్ద పాటుకై  మరియు ఉపవాస  ప్రార్థనకు ఆటంకాలు తొలగి పోవాలని  ప్రార్థన చేస్తే మనము దేవుని గొప్ప శక్తిని అనుభవించగలము. ఉపవాసము ఉన్నప్పుడు కేవలము తిండి మాని వేయుట మాత్రమే కాక దేవుని సన్నిధిలో ఎక్కువసేపు  గడుపుటవలన గొప్ప పరిశుద్దాత్మ శక్తిని పొందుకోగలము .  ఉపవాస సమయాల్లో  నీకు మరియు వేరే వ్యక్తులకు  లేని పోని గొడవలు సృష్టించాలని సాతాను చూస్తుంటాడు , కనుక దాని విషయమై  కనిపెట్టి జాగ్రత్త కలిగిఉండుట మేలు.    
దేవుని పని ఎక్కువగా  చెయ్యాలంటే పరిశుద్దాత్మ శక్తి ఇంకా ఎక్కువగా పొందుకొనుట అవసరము 
ఈ భూ లోకములో మనము ఎన్ని సుఖాలు అనుభవించినా ఎన్ని ఆస్తులు  సంపాదించినా  పరలోకములో  నికి వెళ్లిన తర్వాత మనకు ఇవి ఏమి యేసయ్య సింహాసనము ముందు ఎన్నిక చేయబడవు కానీ మనము ఆయన కొరకు ఎంత పని చేసామో అది మాత్రమే లెక్క చేయబడుతుంది. చాల మంది పెద్ద పెద్ద కంపెనీస్ లో పని చేయుట ధన్యతగా, వాళ్ళ జీవితాంత కలగా (Dream in Life) భావిస్తారు.  మనము యేసయ్య రాజ్యము  ("JESUS Company") లో  పని చేయుట గొప్ప ధన్యత. శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి .  శ్రమలో నీకు ఓర్పు కావాలి అంటే ప్రార్థనలో పట్టుదల కావాలి , దీనికి ఉపవాసము తేలికైన మార్గము.  దేవుడు ఈ వర్తమానమును దీవించును గాక.

Saturday, June 4, 2022

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య //Raja ni sannidhiloney

AFC LYRICS

         రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య

నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య

నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో

ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య

ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
నిన్ను మించిన దేవుడే లేడయ్య


Wednesday, April 13, 2022

సిలువపై పలికిన ఏడు మాటలు // Seven Word's in the Cross

AFC LYRICS



సిలువపై పలికిన ఏడు మాటలు
మన ప్రభువైన యేసు క్రీస్తు – సిలువపై పలికిన ఏడు మాటలు

సిలువపై యేసు క్రీస్తు పలికిన 1 వ మాట: క్షమ సువార్త
లూకా 23:34 
యేసు –తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరినిక్షమించుమని చెప్పెను.
(సింహాసనం పైనుండి వచ్చిన క్షమాపణ కంటే సిలువ పైనుండి వచ్చిన క్షమాపణ గొప్పది)
వీరేమి చేయుచున్నారో వీరెరుగరు:
అవును, నిజంగానే వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగరు. ఆనాటి యూదులు ఎరగకచేసారు గనుక వారు ఆ క్షమాపణ పొందటానికి వారు అర్హులే. ఈనాటి క్రైస్తవులు అంతాఎరిగి, అంటే దేవుని ప్రేమను, ఆయన శక్తిని, 
ఆయన పరిశుద్ధతను అంతా ఎరిగి కూడాతమ క్రియల ద్వారా యేసు క్రీస్తును మరల సిలువ వేస్తున్నారు. పరిశుధ్ధాత్మకువ్యతిరేకంగా పాపాలు చేస్తూ, మరణకరమైన పాప కార్యాల్లో మునిగిపోతూ పరలోకపు తండ్రి
క్షమాపణకు దూరం అయిపోతున్నారు.
(A) వీరేమి చేయుచున్నారో వీరెరుగరు:
అపొ.కార్య3:13 అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మనపితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయననుఅప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల 
చేయుటకు నిశ్చయించినప్పుడు మీరుఅతనియెదుట ఆయనను నిరాకరించితిరి. 3:14 మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైనవాని నిరాకరించి, నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి.
3:15మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను;అందుకుమేము సాక్ష్యులము. 3:17 సహోదరులారా, మీరును మీ అధికారులునుతెలియక చేసితిరని నాకు తెలియును.
అపొ.కార్య 13:26 సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారలారా, యీ రక్షణ వాక్యము మనయొద్దకు పంపబడియున్నది. 13:27యెరూషలేములో కాపురముండువారును, వారి అధికారులును, ఆయననైనను, ప్రతివిశ్రాంతిదినమున చదవబడుచున్న ప్రవక్తల
వచనములనైనను గ్రహింపక, ఆయనకుశిక్ష విధించుటచేత ఆ వచనములను నెరవేర్చిరి.
యోహాను6:1 మీరు అభ్యంతరపడకుండవలెనని యీ మాటలు మీతోచెప్పుచున్నాను. 16:2 వారు మిమ్మును సమాజ మందిరములలో నుండివెలివేయుదురు; మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నాడనిఅనుకొను కాలము వచ్చుచున్నది. 16:3 వారు తండ్రిని నన్నును తెలిసికొనలేదుగనుక ఈలాగు చేయుదురు.
1కొరింథ 2:7 
దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానముమరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమనిమిత్తము నియమించెను. 2:8 అది లోకాధికారులలో ఎవనికిని
తెలియదు; అది వారికితెలిసియుండినయెడల మహిమా స్వరూపియుగు ప్రభువును సిలువవేయకపోయియుందురు.
లేవీ5:17 చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించినవాటిలో దేని నైనను చేసి ఒకడుపాపియైనయెడల అది పొరబాటున జరిగినను అతడు అపరాధియై తన దోషమునకుశిక్ష భరిం చును. 5:18 కావున నీవు
ఏర్పరచిన వెలచొప్పున మందలో నుండినిర్దోషమైన పొట్టేలును అపరాధపరిహారార్థబలిగా అతడు యాజకునియొద్దకుతీసికొనిరావలెను. అతడు తెలియకయే పొరబాటున చేసిన తప్పునుగూర్చి యాజకుడుఅతని
నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. 5:19 అదిఅపరాధపరిహారార్థబలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినదివాస్తవము.
1తిమోతి1:12 12-13. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైననన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్నుబలపరచిన మన ప్రభువైన క్రీస్తుయేసుకు
కృతజ్ఞుడనై యున్నాను. తెలియకఅవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.
(B) అన్నీ తెలిసి తప్పిపోయేవారి సంగతి ఏమిటి?
హెబ్రీ 6:4
ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రూచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై 6:5 దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగసంబంధమైన శక్తుల(ప్రభావమును) అనుభవించిన తరువాత 6:6 తప్పిపోయినవారు తమ విషయములోదేవుని కుమారుని మరల సిలువ వేయుచు, బాహాటముగా అవమానపరచుచున్నారుగనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.
హెబ్రీ10:26 మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాతబుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలియికను ఉండదు గాని10:27 న్యాయపుతీర్పుకు భయముతో
ఎదురుచూచుటయు, విరోధులనుదహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. 10:28 ఎవడైనను మోషేధర్మశాస్త్రమును నిరాకరించిన యెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద,కనికరింపకుండ వాని చంపించుదురు. 10:29 ఇట్లుండగా దేవుని కుమారుని,పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన 
రక్తమునుఅపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంతఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును?
2 పేతురు 2:20
వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైనఅనుభవజ్ఞానముచేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలవాటిలో చిక్కుబడి వాటిచేత జయింపబడినయెడల, వారి కడవరి
స్థితి మొదటి స్థితికంటెమరి చెడ్డదగును. 2:21 వారు నీతిమార్గమును అనుభవపూర్వకముగా తెలిసికొని,తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞనుండి తొలగిపోవుటకంటె ఆ మార్గముఅనుభవపూర్వకముగా
  తెలియకుండటయే వారికి మేలు. 2:22 కుక్క తన వాంతికితిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైనసామితె చొప్పున వీరికి సంభవించెను.
సిలువపై యేసు క్రీస్తు పలికిన 2 వ మాట: రక్షణ సువార్త
లూకా 23:42 
ఆయనను చూచి – యేసూ, నీవు నీ రాజ్యముతోవచ్చునప్పుడునన్ను జ్ఞాపకము చేసికొనుమనెను.
లూకా 23:43 
అందుకాయన వానితో – నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువనినిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను.
నెహెమ్యా 13:14
నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపకముంచుకొని, నా దేవునిమందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములనుమరువకుండుము.
2రాజులు20:1 ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన. .. . రోగముకలుగగా, ఆమోజు కుమారుడును ప్రవక్త యునైన యెషయా అతనియొద్దకు వచ్చినీవుమరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుమని యెహోవాసెలవిచ్చుచున్నాడని
చెప్పగా 20:2 అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని 20:3యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచు కొంటినో,నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో
  కృపతో జ్ఞాపకముచేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను.
పరదైసు అనేది ప్రభువు కృపకు పాత్రులైన వారు చనిపోయిన తరువాత వెళ్ళి నివసించేతాత్కాలిక పరలోకం. వారు తమ ప్రభువు తమకు ఇవ్వబోయే శాశ్వత పరలో్కానికి అంటేక్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అనబడే నిత్య
రాజ్యానికి చేరేంతవరకు పరదైసులోనే పరిశుధ్ధులసహవాసంలో పరమానంద భరితులుగా జీవిస్తూ ఉంటారు. ఈ పరదైసు భూమి క్రిందిభాగంలో ఉండేది. యేసు క్రీస్తు సిలువ మీద మరణించిన వెంటనే భూమి క్రింది భాగానికివెళ్ళి 
ఆ పరదైసును మధ్యాకాశంలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు.
ఎఫెసీ Eph 4:8 అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొనిపోయిమనుష్యులకు ఈవులను అనుగ్రహించెనని (ప్రవక్త) చెప్పియున్నాడు. 4:9ఆరోహణమాయెననగా ఆయన భూమియొక్క క్రింది భాగములకు
దిగెననియుఅర్థమిచ్చుచున్నది గదా. 4:10 దిగినవాడు తానే సమస్తమును నింపునట్లుఆకాశమండలములన్నిటికంటె మరి పైకి ఆరోహణమైనవాడునై యున్నాడు.
ఎఫెసీ 2:4- 5.
అయినను దేవుడు కరుణాసంపన్నుడైయుండి, మనము మనఅపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సహా, మనయెడల చూపిన తనమహాప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను. కృప చేతనే మీరు
రక్షింపబడియున్నారు. 2:6 క్రీస్తుయేసునందు ఆయన మనకుచేసిన ఉపకారముద్వారాఅత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవుయుగములలో కనుపరచు నిమిత్తము, 2:7 క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందుఆయనతోకూడ కూర్చుండబెట్టెను.
ఫిలిప్పీ3:20 
మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడినుండి ప్రభువైనయేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.
కొలొస్సీ3:1 మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. 3:2 -3. పైనున్నవాటిమీదనే గానిభూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి;
ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీజీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది.
హెబ్రీ12:22 ఇప్పుడైతే సీమోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు,అనగా పరలోకపు యెరూషలేముకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును, 12:23పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘమునకును,
వారిమహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవునియొద్దకును, సంపూర్ణసిద్ధిపొందిన నీతిమంతుల ఆత్మలయొద్దకును, 12:24 క్రొత్తనిబంధనకు మధ్యవర్తియైనయేసునొద్దకును, హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు
ప్రోక్షణ రక్తమునకును మీరువచ్చియున్నారు.
సిలువపై యేసు క్రీస్తు పలికిన 3 వ మాట: రాజ్య సువార్త
యోహాను19:26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరనిలుచుండుట చూచి -అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను; 19:27తరువాత శిష్యుని చూచి – యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడుఆమెను తన యింట చేర్చుకొనెను.
యేసు క్రీస్తు రాజ్యంలో చేరేవారంతా యేసు రక్త సంబంధులు. లోక సంబంధమైనరక్తసంబంధం తాత్కాలికమైనది, బలహీనమైనది. యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచేవారంతాఆయన రాజ్య సంబంధులై ఉంటారు కాబట్టి వారి మధ్య 
ఉండే యేసు రక్త సంబంధంశాశ్వతమైనది, బహు బలమైనది.
ఎఫెసీ3:14 ఈ హేతువుచేత పరలోకమునందును భూమిమీదను ఉన్న ప్రతికుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేనుమోకాళ్లూని… ప్రార్థించుచున్నాను.
1కొరింథీ2:12 ఏలాగు శరీరము ఏకమై యున్నను అనేకమైన అవయవములుకలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్క శరీరమై యున్నవో,
ఆలాగే క్రీస్తు ఉన్నాడు. 12:13 ఏలాగనగా,యూదులమైనను హెల్లేనీయులమైనను, దాసులమైనను స్వతంత్రులమైనను, మన మందరము ఒక్క శరీరముగా ఉండుటకు ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి.మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి.
1తిమోతి5:1 వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. 5:2అన్నదమ్ములని యౌవనస్థులను, తల్లులని వృద్ధస్త్రీలను అక్కచెల్లెండ్లనిపూర్ణపవిత్రతతో యౌవనస్త్రీలను హెచ్చరించుము.
గలతీ6:2 ఒకని భారములనొకడు భరించి యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగానెరవేర్చుడి.
ఫిలేమోను1:10 8-10. కావున యుక్తమైనదానిగూర్చి నీకాజ్ఞాపించుటకుక్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగియున్నను, వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తుయేసుఖైదినైయున్న పౌలను నేను ప్రేమనుబట్టి వేడుకొనుట మరి 
మంచిదనుకొని, నాబంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్నువేడుకొనుచున్నాను.
యెషయా58:7 నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికిముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు58:8 వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము
లిచ్చుటయు ఇదియే గదానాకిష్టమైన ఉపవాసము?
సిలువపై యేసు క్రీస్తు పలికిన 4 వ మాట: శ్రమ సువార్త
మత్తయి7:46 ఇంచుమించు మూడుగంటలప్పుడు యేసు – ఏలీ ఏలీ లామాసబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యివిడిచితివని అర్థము.
కీర్తన2:1 నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నాఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు?
(క్రీస్తు ఈ భూమి మీద మానవ జన్మ ధరించడానికి ఇంకా సుమారు వెయ్యి సంవత్సరాలకాలం ఉన్నపుడే ఈ ప్రవచనం ఇవ్వబడింది. అది అక్షరాలా నెరవేరింది.)
విలాప3:31 ప్రభువు సర్వకాలము విడనాడడు. 3:32 ఆయన బాధపెట్టినను తనకృపాసమృద్ధినిబట్టి జాలి పడును. 3:33 హృదయ పూర్వకముగా ఆయన నరులకువిచారము నైనను బాధనైనను కలుగజేయడు.
హెబ్రీ12:7 శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడుకుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? 12:8కుమాళ్లయినవారందరు శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందనియెడలదుర్బీజులేగాని కుమారులుగారు. 12:9 మరియు శరీరసంబంధులైన తండ్రులు మనకుశిక్షకులై యుండిరి వారియందు భయభక్తులు కలిగియుంటిమి; అట్లయితే ఆత్మలకుతండ్రియైనవానికి
మరిఎక్కువగా లోబడి బ్రదుకవలెను గదా? 12:10 వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టమువచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తనపరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించుచున్నాడు. 
12:11మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగానిసంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అదినీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.
యెషయా3:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మనవ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలనబాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి.
53:5 మనయతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టినలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందినదెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది. 53:6
మనమందరము గొఱ్ఱలవలె త్రోవతప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరిదోషమును అతనిమీద మోపెను.
మార్కు 14:50 అప్పడు వారందరు ఆయనను విడిచి పారిపోయిరి.
యోహాను8:29 నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైనకార్యము నేనెల్లప్పుడును చేయువాడను గనుక ఆయన నన్ను ఒంటిగావిడిచిపెట్టలేదని చెప్పెను.
Wear the Cross – Bear the Crown
సిలువను భరించు – కిరీటాన్ని ధరించు
No Cross – No Crown
సిలువ (శ్రమలు) నాకొద్దంటే కిరీటం కూడా నాకొద్దన్నట్లే
సిలువపై యేసు క్రీస్తు పలికిన 5 వ మాట: సజీవ సువార్త
యోహాను9:28 అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసుఎరిగి లేఖనము నెరవేరునట్లు – నేను దప్పిగొనుచున్నాననెను.
సజీవంగా ఉన్నవారే దాహం అని అంటారు గాని, చనిపోయిన వారు దాహం అని అనరు.సజీవంగా ఉన్న మనిషికి ఆకలి కలగని పరిస్థితి ఉంటుంది గానీ, దాహం కలగని పరిస్థితి ఉండదు.
కీర్తన2:1 దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణముఆశపడుచున్నది. 42:2 నా ప్రాణము దేవునికొరకు తృష్ణ గొనుచున్నది జీవము గలదేవునికొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనేప్పుడు వచ్చెదను? 
ఆయనసన్నిధిని నేనెప్పుడు కనబడెదను?
కీర్తన3:1 దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును 63:2 నీబలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయ మందు నేనెంతో ఆశతోనీతట్టు కని పెట్టియున్నాను. నీళ్లు లేక యెండియున్న దేశమందు నా ప్రాణమునీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరముకృశించుచున్నది.
యోహాను7:37 ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి –ఎవడైన దప్పిగొనిన యెడల నాయెద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. 7:38నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టువాని కడుపులోనుండి
జీవజలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. 7:39 తనయందు విశ్వాసముంచువారుపొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకమహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.
యెషయా5:1 దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి రూకలులేనివారలారా,మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియునియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. 55:2 ఆహారము కానిదానికొరకు
మీ రేలరూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయనిదానికొరకు మీ కష్టార్జితమును ఎందుకువ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీప్రాణముసారమైనదానియందు సుఖింపనియ్యుడి.
దాహం అంటే ఏమిటో యేసు క్రీస్తుకు తెలుసు కాబట్టి ఆయనే మన ఆత్మీయ దాహాన్నితీర్చగలడు.
యోహాను4:7 సమరైయ స్త్రీ యెకతె నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు –నాకు దాహమునకిమ్మని ఆమెనడిగెను.
సిలువపై యేసు క్రీస్తు పలికిన 6 వ మాట: విజయ సువార్త లేక సంపూర్ణసువార్త
యోహాను9:30 యేసు ఆ చిరక పుచ్చుకొని -సమాప్తమైనదని చెప్పి తల వంచిఆత్మను అప్పగించెను.
రోమా10:4 విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకుసమాప్తియైయున్నాడు. (It is finished! ఇది ఒక విజయ నినాదం)
కొలొస్సీ2:13 13-15. మరియు అపరాధములవలనను, శరీరమందుసున్నతిపొందకయుండుటవలనను, మీరు మృతులైయుండగా దేవుడు విధిరూపకమైనఆజ్ఞలవలన మనమీద రుణముగాను
మనకు విరోధముగానుండిన పత్రమునుమేకులతో
సిలువకు కొట్టి, దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండదానిని ఎత్తివేసి, మన అపరాధములనన్నిటిని క్షమించి ఆయనతోకూడ మిమ్మునుజీవింపచేసెను; 
ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి,సిలువచేత
జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా (వేడుకకు)కనుపరచెను.
2తిమోతి4:7 మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని,విశ్వాసము కాపాడుకొంటిని.
హెబ్రీ9:26 అట్లయినయెడల జగత్తు పునాదివేయబడినది మొదలుకొని ఆయనఅనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే యుగముల సమాప్తియందుతన్నుతానే బలిగా
అర్పించుకొనుటవలన పాపనివారణచేయుటకై యొక్కసారే ప్రత్యక్ష పరచబడెను.
ప్రసంగి Ecc 7:8 కార్యారంభముకంటె కార్యాంతము మేలు;
Race was run – Duty done – Victory won
సిలువపై యేసు క్రీస్తు పలికిన 7 వ మాట:నిత్య సువార్త
లూకా3:46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి – తండ్రీ, నీ చేతికి నాఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను.
ఆది2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.
యోబుJob 27:2 నా ఊపిరి యింకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియుదేవునిఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టియు…
సామెతలు Pro 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగము లన్నియు శోధించును.
1 థెస్స 1Th 5:19 ఆత్మను ఆర్పకుడి.
1కొరింథీ6:19 మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్నపరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా?
1కొరింథీ3:16 మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలోనివసించుచున్నాడనియు మీరెరుగరా?
1పేతురు4:19 కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్ ప్రవర్తనగలవారై,నమ్మకమైన సృష్టకర్తకు తమ ఆత్మలను అప్పగించు కొనవలెను.



Monday, February 21, 2022

యేసయ్యా మా స్తోత్రములకు అర్హుడువు నీవే ( స్తుతి నైవేద్యము ) | Stuti Naivedyam

AFC LYRICS



1. మా కొరకు మీరక్తాన్ని చిందించిన యేసయ్యా  మీకు వందనాలు    ప్రకటన(1:6)
2. మా పాపములనుండి మమ్ములను విడిపించిన దేవా మీకు స్తోత్రము  ప్రకటన(1:6)
3. తండ్రీ యుగయుగములకు  మీకు మహిమ కలుగును గాక    ప్రకటన(1:6)
4. తండ్రీ యుగయుగములకు  మీకు ఘనత కలుగును గాక     ప్రకటన(1:6)
5. అల్ఫాయు,ఒమేగయు అయి ఉన్న దేవా మీకు స్తోత్రము  ప్రకటన(1:8)
6. సర్వాధికారి మీకు స్తోత్రము     ప్రకటన(1:8)
7. భూత కాలములో ఉన్న దేవా  మీకు స్తోత్రము  ప్రకటన(1:8)
8. వర్తమాన కాలములో ఉన్న దేవా మీకు స్తోత్రము  ప్రకటన(1:8)
9. భవిషత్ కాలములో ఉన్న దేవా మీకు స్తోత్రము   ప్రకటన(1:8)
10. మనుష కుమారుడా  మీకు స్తోత్రము   ప్రకటన(1:8)
11. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన దేవా మీకు స్తోత్రము  ప్రకటన(1:13)
12. అపరంజి వంటి పాదములు కల దేవా మీకు స్తోత్రము   ప్రకటన(1:13)
13. యెహోవా పరిశుద్దుడు పరిశుద్దుడు పరిశుద్దుడు   ప్రకటన(1:14)
14. మహిమ ,ఘనత ప్రభావము  పొందనర్హుడా మీకు స్తోత్రము ప్రకటన(1:15)
15. మా దేవునికి గొర్రెపిల్లకు  మా రక్షణ కై   స్తోత్రము  ప్రకటన(7:10)
16. యెహోవా మీకే మహిమ కలుగును గాక   ప్రకటన(7:12)
17. యెహోవా మీకే  జ్ఞానము  కలుగును గాక  ప్రకటన(7:12)
18. యెహోవా మీకే  ఘనత  కలుగును గాక   ప్రకటన(7:12)
19. యెహోవా  మీకే శక్తి కలుగును గాక     ప్రకటన(7:12)
20. యెహోవా మీకే కృతజ్ఞతా స్తుతియు కలుగును గాక   ప్రకటన(7:12)
21. యెహోవా మీకే బలము కలుగునుగాక   ప్రకటన(7:12)
22. యుగ యుగములు ఏలువాడ మీకు స్తోత్రము   ప్రకటన(11:15)
23. ఈ లోక రాజ్యము ఆయన క్రీస్తు  రాజ్యము నాయెను మీకు స్తోత్రం   ప్రకటన(11:15)
24. మన ప్రభువు రాజ్యము ఆయన క్రీస్తు  రాజ్యము నాయెను  మీకు స్తోత్రం  ప్రకటన(11:15)
25. నీ క్రియలు ఘనమైనవి  తండ్రీ  మీకు స్తోత్రము ప్రకటన(15:4)
26. తండ్రీ మీ క్రియలు ఆశ్చర్యమైనవి మీకు స్తోత్రం  ప్రకటన(15:4)
27. తండ్రీ మీ మార్గములు న్యాయములను సత్యములునై  యున్నవి మీకు స్తోత్రం  ప్రకటన(15:4)
28. తండ్రీ నీవు మాత్రము పవిత్రుడవు  నీకు స్తోత్రం  ప్రకటన(15:4)
29. తండ్రీ నీకు బయపడనివాడెవడు  మీకు స్తోత్రం   ప్రకటన(15:4)
30. తండ్రీ నిన్ను మహిమపరచని వాడెవడు  మీకు  స్తోత్రం ప్రకటన(15:4)
31. మహా బబులోను కూలిపోయెను, కూలిపోయెను  మీకు స్తోత్రం ప్రకటన(18:2)
32. రక్షణ మహిమ ప్రభావములు  మీకే చెల్లును మీకు స్తోత్రము ప్రకటన(19:2)
33. నమ్మకమైన తండ్రీ మీకు స్తోత్రం ప్రకటన(19:11)
34. సమస్తమును నూతనమైనవిగా  చేయుచున్న వాడా  మీకు స్తోత్రం ప్రకటన(21:5)
35. వెలుగైయున్న దేవా నీకు స్తోత్రం 1యోహాను(1:5)
36. చీకటి ఎంతమాత్రమూ లేని దేవా మీకు స్తోత్రం  1యోహాను(1:6)
37. మా పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మమ్ములను పవిత్రులనుగా చేసిన తండ్రీ మీకు స్తోత్రం     1యోహాను(1:9)
38. మమ్ములను సమస్తమైన దుర్నీతినుండి పవిత్రులుగా చేయు తండ్రీ మీకు స్తోత్రం 1యోహాను(1:9)
39. యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మీకు స్తోత్రం 1యోహాను(2:1)
40. మా పాపములకు శాంతికరమైన యేసయ్య మీకు స్తోత్రం 1యోహాను(2:2)
41. సర్వలోకమునకు శాంతికరమైన యేసయ్య మీకు స్తోత్రం  1యోహాను(2:3)
42. తండ్రీ మేము మీ పిల్లలగునట్లు మాకు అనుగ్రహించిన మీ ప్రేమకై మీకు స్తోత్రం  1యోహాను(3:1)
43. పాపమేమియూ లేని తండ్రీ  మీకు స్తోత్రం 1యోహాను(3:5)
44. అపవాది క్రియలు లయపరచుటకే  యేసయ్య మీరు ప్రత్యక్ష మయ్యారు.అందును బట్టి  మీకు స్తోత్రం 1యోహాను(3:8)
45. మీ ఆత్మలో మాకు పాలుదయచేసిన తండ్రీ  మీకు స్తోత్రం 1యోహాను(4:13)
46. యేసయ్య నీవు దేవుని కుమారుడవు అందును బట్టి  మీకు స్తోత్రం 1యోహాను(4:15)
47. ప్రేమా స్వరూపి మీకు స్తోత్రం  1యోహాను(4:16)
48. మా యెడల మీకు ఉన్న ప్రేమకై  తండ్రీ మీకు స్తోత్రం   1యోహాను(4:16)
49. నిత్యజీవము మాకు దయచేసిన  తండ్రీ  మీకు వందనాలు   1యోహాను(5:11)
50. నిజమైన దేవుడవైన యేసయ్యా మీకు స్తోత్రం   1యోహాను(5:20)
51. సత్యవంతుడవైన యేసయ్యా మీకు స్తోత్రం        1యోహాను(5:20) 
52. యేసయ్యా మీకు శుభము     3 యోహాను(1:1)
53. యుగములకు పూర్వము దేవునికి మహిమ కలుగును గాక     యూదా(1:25)
54. యుగములకు పూర్వము దేవునికి మహత్యము కలుగును గాక   యూదా(1:25)
55. సర్వ యుగములకు దేవునికి మహిమ కలుగును గాక     యూదా(1:25)
56. యుగములకు పూర్వము దేవునికి అధికారము కలుగును గాక  యూదా(1:25)
57. యుగములకు పూర్వము దేవునికి  ఆధిపత్యము  కలుగును గాక యూదా(1:25)
58. ఇప్పుడును దేవునికి మహిమ కలుగును గాక  యూదా(1:25) 
59. ఇప్పుడును దేవునికి మహత్యము కలుగును గాక    యూదా(1:25)  
60. సర్వ యుగములకు దేవునికి మహత్యము కలుగును గాక     యూదా(1:25)  
61. ఇప్పుడును దేవునికి అధికారము కలుగును గాక     యూదా(1:25)  
62. ఇప్పుడును దేవునికి ఆధిపత్యము  కలుగును గాక.  యూదా(1:25)  
63. సర్వ యుగములకు దేవునికి  అధికారము కలుగును గాక  యూదా(1:25)  
64. సర్వ యుగములకు దేవునికి ఆధిపత్యము కలుగును గాక   యూదా(1:25)  
65. రక్షణ మహిమ ప్రభావములు  మన దేవునికే  చెల్లును    యూదా(1:25)  
66. భయపడకుమని మాతో చెప్పిన  యేసయ్య  మీకు స్తోత్రం   యూదా(1:25)  
67. అక్షయమైన స్వాస్థ్యము మాకు కలుగునట్లు మమ్ములను జన్మింపచేసిన తండ్రీ మీకు వందనాలు.  1పేతురు(1:4)
68. నిర్మలమైన స్వాస్యము మాకు కలుగునట్లు మమ్ములను జన్మింపచేసిన తండ్రీ మీకు వందనాలు.  1పేతురు(1:4)
69. వాడబరని స్వాస్యము మాకు కలుగునట్లు మమ్ములను జన్మింపచేసిన చేసిన తండ్రీ మీకు వందనాలు.  1పేతురు(1:4)
70. దయాళుడా మీకు స్తోత్రం 1పేతురు(2:1)
71. తండ్రీ మీయొక్క అముల్యమైన వాగ్దానముల కొరకై వందనాలు   11పేతురు(1:4)
72. తండ్రీ మీయొక్క  అత్యధికములైన వాగ్దానముల కొరకై వందనాలు 11పేతురు(1:4)
73. మమ్ములను శోధనలోనుంచి తప్పించగల సమర్థుడా  మీకు స్తోత్రం  11పేతురు(2:9)
74. తండ్రీ మీ వాక్యము మా చీకటిగల జీవితానికి వెలుగై ఉన్నది  మీకు స్తోత్రం 11పేతురు(1:19)
75. మమ్ములను ఆశీర్వాదానికి వారసులుగా  పిలిచిన తండ్రీ  మీకు స్తోత్రం  1పేతురు(3:9)
76. ఆత్మల కాపరి మీకు వందనాలు హెబ్రీ(2:25)
77. గొప్ప కాపరి మీకు స్తోత్రం  హెబ్రీ(13:20)
78. యుగయుగములు మహిమా ప్రభావములు మన దేవునికి ఉండును గాక హెబ్రీ(13:21)
79. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించే  తండ్రీ  మీకు వందనాలు 1పేతురు(5:5)
80. మా కొరకు చింతించుచున్న  యేసయ్య మీకు వందనాలు 1పేతురు(5:7)
81. మమ్ములను తగిన సమయమందు  హెచ్చించె యేసయ్యా  మీకు స్తోత్రం 1పేతురు(5:6)
82. మహిమా స్వరూపి  మీకు స్తోత్రం  యాకోబు(2:1)
83. దేవుని మహిమ యొక్క తేజస్సు అయిన యేసయ్యా మీకు స్తోత్రం  హెబ్రీ(1:3)
84. దేవుని తత్వము యొక్క  మూర్తిమంతమైన  యేసయ్యా  మీకు స్తోత్రం  హెబ్రీ(1:4)
85. మీ మహత్తు గల మాటచేత సమస్తమును నిర్వహించే  యేసయ్యా  మీకు స్తోత్రం  హెబ్రీ(1:4)
86. మా పాపముల విషయములో శుద్దీకరణ చేసిన యేసయ్యా  మీకు స్తోత్రం హెబ్రీ(1:4)
87. దేవ దూతలకంటే శ్రేష్ఠమైన నామము పొందిన యేసయ్యా  మీకు స్తోత్రం  హెబ్రీ(1:4)
88. దేవ దూతల కంటే  శ్రేష్ఠుడైన  యేసయ్యా  మీకు స్తోత్రం హెబ్రీ(1:4)
89. మహా మహుడగు దేవా  మీకు స్తోత్రం  హెబ్రీ(1:4)
90. ఆదిసంభూతుడా మీకు స్తోత్రం హెబ్రీ(1:6)
91. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును మీకు స్తోత్రం హెబ్రీ(1:8)
92. నీ రాజదండము న్యాయార్థమైనది  మీకు స్తోత్రం  హెబ్రీ(1:8)
93. ఆకాశములు నీ చేతి పనులే అందును బట్టి  మీకు స్తోత్రం  హెబ్రీ(1:10)
94. ఏకరీతిగా ఉన్న యేసయ్యా  మీకు స్తోత్రం హెబ్రీ(1:12)
95. మహిమా ప్రభావములతో మాకు కిరీటము ధరింపజేసిన  యేసయ్యా  మీకు స్తోత్రం హెబ్రీ(2:7)
96. నీ చేతిపనులపై మాకు అధికారము ఇచ్చిన తండ్రీ మీకు స్తోత్రం హెబ్రీ(2:7)
97. మా పాదముల క్రింద సమస్తమును ఉంచిన  తండ్రీ  మీకు స్తోత్రం హెబ్రీ(2:8)
98. తండ్రీ నీవు మనుషుని జ్ఞాపకము  చేసికొనుటకు వాడేపాటివాడు అయినను మీ కృపకై  స్తోత్రం  హెబ్రీ(2:6)
99. నీవు నర పుత్రుని  దర్శించుటకు వాడేపాటివాడు అయినను మీ కృపకై మీకు స్తోత్రం హెబ్రీ(2:6)
100. మోషే  కంటే ఎక్కువ మహిమకు అర్హుడా  మీకు స్తోత్రం హెబ్రీ(3:4)
101. మీరు శోధింపబడి శ్రమ పొందావు  గనుక  శోధింపబడువారికి సహాయము చేయువాడవై ఉన్నందుకు మీకు స్తోత్రం హెబ్రీ(2:18)
102. మీ సూచక క్రియలకై  మీకు స్తోత్రం హెబ్రీ(2:4)
103. మీ మహత్కార్యములకై మీకు స్తోత్రం  హెబ్రీ(2:4)
104. మీరు చేసిన నానావిధములగు అద్భుతముల కొరకై  మీకు స్తోత్రం  హెబ్రీ(2:4)
105. మీరు అనుగ్రహించిన వివిధ పరిశుద్దాత్మ వరములకై మీకు స్తోత్రం  హెబ్రీ(2:4)
106. సజీవమైన దేవుని వాక్యమా మీకు స్తోత్రం  హెబ్రీ(4:12)
107. బలము గల దేవుని వాక్యమా మీకు స్తోత్రం  హెబ్రీ(4:12)
108. రెండంచులుగల  ఎటువంటి ఖడ్గముకంటే వాడి గల దేవుని వాక్యమా  మీకు స్తోత్రం  హెబ్రీ(4:12)
109. మాకు మీరు అనుగ్రహించబోయే విశ్రాంతికై  మీకు స్తోత్రం  హెబ్రీ(4:9)
110. తండ్రీ మీరు అన్యాయస్తుడు కారు అందును బట్టి  మీకు స్తోత్రం  హెబ్రీ(6:10)
111.      షాలేము రాజా  మీకు స్తోత్రం   హెబ్రీ(7:3)
112. మహోన్నతుడగు దేవుని యాజకుడా మీకు స్తోత్రం  హెబ్రీ(7:3)
113. నీతికి రాజా మీకు స్తోత్రం   హెబ్రీ(7:3)
114. సమాధానపు రాజా మీకు స్తోత్రం హెబ్రీ(7:3)
115. తండ్రి  లేని వాడా మీకు స్తోత్రం   హెబ్రీ(7:3)
116. తల్లి లేని వాడా మీకు స్తోత్రం    హెబ్రీ(7:3) 
117. జీవితకాలమునకు ఆదిలోని తండ్రీ మీకు స్తోత్రం  హెబ్రీ(7:3)
118. జీవమునకు అంతములేని వాడా మీకు స్తోత్రం   హెబ్రీ(7:3)
119. నాశనము లేని జీవమైన తండ్రి  మీకు స్తోత్రం  హెబ్రీ(7:16)
120. మా కొరకు విజ్ఞాపన చేయుటకై నిరంతరము జీవించి యున్న యేసయ్య  హెబ్రీ(7:25)
121. మమ్ములను సంపూర్ణముగా రక్షించుటకై శక్తిమంతుడైన యేసయ్య    హెబ్రీ(7:25)
122. పవిత్రుడా మీకు స్తోత్రం  హెబ్రీ(7:26)
123. నిర్దోషి  మీకు స్తోత్రం  హెబ్రీ(7:26)
124. నిష్కల్మషుడా మీకు స్తోత్రం    హెబ్రీ(7:26)
125. పాపులలో చేరకప్రత్యేకముగా ఉన్న యేసయ్య మీకు స్తోత్రం  హెబ్రీ(7:26)
126. ఆకాశమండలముకంటె  మిక్కిలి హెచ్చయినవాడా మీకు స్తోత్రం   హెబ్రీ(7:26)
127. మా కొరకై మిమ్ములను అర్పించుకొన్న యేసయ్య మీకు స్తోత్రం హెబ్రీ(7:28)
128. మా కొరకు మీరు చేసిన కొత్తనిబంధనకై యేసయ్య మీకు స్తోత్రం హెబ్రీ(8:13)
129. మా పాపములను ఇక ఎన్నడునూ జ్ఞాపకము చేసికొనని చెప్పిన ప్రభువా  మీకు స్తోత్రం  హెబ్రీ(8:12)
130. యుగముల సమాప్తి యందు మాకొరకు బలిగా అర్పించుకొన్న  యేసయ్య  మీకు స్తోత్రం  హెబ్రీ(9:26)
131. గొప్ప యాజకుడా  మీకు స్తోత్రం హెబ్రీ(10:21)
132. నమ్మదగిన వాడా మీకు స్తోత్రం హెబ్రీ(10:23)
133. ప్రపంచములు నీ వాక్యము వలన నిర్మాణమైనవి అందును బట్టి మీకు స్తోత్రం   హెబ్రీ(11:3)
134. మీరు మా దేవుడని అనిపించుకొనుటకు సిగ్గు పడని తండ్రి మీకు స్తోత్రం   హెబ్రీ(11:16)
135. మా కొరకు సిద్ధపరచిన పట్టణముకై తండ్రి మీకు స్తోత్రం    హెబ్రీ(11:16)
136. మృతులను సహితము లేపుటకు శక్తిమంతుడా  తండ్రి మీకు స్తోత్రం  హెబ్రీ(11:19)
137. మా కొరకు మరి శ్రేష్ఠమైన దానిని సిద్ధపరచిన తండ్రి  తండ్రి మీకు స్తోత్రం  హెబ్రీ(11:40)
138. విశ్వాసమునకు కర్త  మీకు స్తోత్రం    హెబ్రీ(12:2)
139. విశ్వాసమునకు మా జీవితాలలో  కొనసాగించే యేసయ్య మీకు స్తోత్రం   హెబ్రీ(12:2)
140. మా కొరకై అవమానమును నిర్లక్షపెట్టిన యేసయ్య మీకు స్తోత్రం  హెబ్రీ(12:2)
141. మా కొరకై సిలువను సహించిన  యేసయ్య  మీకు స్తోత్రం హెబ్రీ(12:2)
142. దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్యమున ఆసీనుడైన యేసయ్య మీకు స్తోత్రం హెబ్రీ(12:2)
143. పాపాత్ములు మీకొరకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమును సహించిన యేసయ్య మీకు స్తోత్రం హెబ్రీ(12:3)
144. దేవుని కుమారులుగా మమ్ములను చూచుచున్నావు తండ్రి మీకు స్తోత్రం హెబ్రీ(12:7)
145. దహించు అగ్నియైన తండ్రి మీకు స్తోత్రం హెబ్రీ(12:29)
146. కొత్త నిబంధనకు మద్యవర్త్తియైన యేసయ్య   మీకు స్తోత్రం  హెబ్రీ(12:24)
147. నిన్ను ఏ మాత్రమూ విడువను అని చెప్పిన యేసయ్య మీకు స్తోత్రం హెబ్రీ(13:5)
148. నిన్ను ఎన్నడును ఎడబాయను అని చెప్పిన యేసయ్య మీకు స్తోత్రం హెబ్రీ(13:5)
149. నిన్న, నేడు, నిరంతరం  ఏక రీతిగా ఉన్న యేసయ్య మీకు స్తోత్రం  హెబ్రీ(13:8)
150. యుగయుగములకు ఒక్క రీతిగా ఉన్న యేసయ్య మీకు స్తోత్రం  హెబ్రీ(13:8)
151. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక  ఆమెన్  హెబ్రీ(13:21)
152. మహా తేజస్సుతో ప్రకాశించుచున్న  సూర్యుని వంటి ముఖము కలిగిన యేసయ్యా మీకు స్తోత్రం   ప్రకటన(1:16)
153. విస్తార జల ప్రవాహముల వంటి కంఠ స్వరము కలిగిన యేసయ్యా మీకు స్తోత్రం    ప్రకటన(1:15)
154. మొదటివాడా  మీకు స్తోత్రం   ప్రకటన(1:18)
155. కడపటివాడా మీకు స్తోత్రం  ప్రకటన(1:18)
156. జీవించువాడా మీకు స్తోత్రం   ప్రకటన(1:18)
157. తెల్లని ఉన్నిని పోలిన తలవెంట్రుకలు  కలిగిన యేసయ్యా  మీకు స్తోత్రం  ప్రకటన(1:14)  
158. ఇప్పుడు రక్షణయు మన  దేవుని దాయెను  ప్రకటన(12:10) 
159. ఇప్పుడు  శక్తియు  మన  దేవుని దాయెను  ప్రకటన(12:10)
160. ఇప్పుడు రాజ్యమును మన దేవునిదాయెను   ప్రకటన(12:10)
161. జ్ఞాన బలములు కల  తండ్రి మీకు స్తోత్రం   దానియేలు (2:20) 
162. యుగములన్నింటను  దేవుని నామము  స్తుతినొందును గాక   దానియేలు (2:20)  
163. కాలములను, సమయములను  మార్చువాడా  మీకు స్తోత్రం   దానియేలు (2:20)  
164. రాజులను త్రోసివేయుచు నియమించుచున్నవాడా మీకు స్తోత్రం   దానియేలు (2:20)  
165. వివేకులకు  వివేకము నియమించుచున్నవాడామీకు స్తోత్రం    దానియేలు (2:20)  
166. జ్ఞానులకు జ్ఞానము  నియమించుచున్నవాడా మీకు స్తోత్రం   దానియేలు (2:20)  
167. మరుగు మాటలను మర్మములను బయలుపరచుదేవా మీకు స్తోత్రం   దానియేలు (2:22)
168. అంధకారములోని సంగతులు తెలిసిన దేవా మీకు స్తోత్రం  దానియేలు (2:22)
169. వెలుగు యొక్క నివాసస్థలము  నీ యొద్ద యున్న దేవా మీకు స్తోత్రం   దానియేలు (2:22)
170. దేవతలకు దేవుడా మీకు స్తోత్రం    దానియేలు (2:47)
171. రాజులకు ప్రభువా మీకు స్తోత్రం   దానియేలు (2:47)
172. పూజార్హుడా  మీకు స్తోత్రం దానియేలు (3:28)
173. మీ సూచక క్రియలు ఎంతో బ్రహాండమైనవి మీకు స్తోత్రం    దానియేలు (4:3)
174. తండ్రి మీ అద్భుతములు ఎంతో ఘనమైనవి మీకు స్తోత్రం   దానియేలు (4:3)
175. తండ్రి మీ రాజ్యము శాశ్వత రాజ్యము   దానియేలు (4:3)
176. తండ్రి మీ ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది      దానియేలు (4:3)
177. మహోన్నతుడవగు  దేవా మీకు స్తోత్రం దానియేలు (4:17)
178. మానవుల రాజ్యములపైన అధికారివై యున్నదేవా మీకు స్తోత్రం  దానియేలు (4:17)
179. తానెవరికి అనుగ్రహింప  నిశ్చయించునో వారికి అనుగ్రహించువాడా మీకు స్తోత్రం  దానియేలు (4:17)
180. ఆయా రాజ్యముల మీద అత్యల్ప మనుషులను నియమించువాడా మీకు స్తోత్రం    దానియేలు (4:17)
181. తండ్రి  మీ యొక్క కార్యములన్నియునూ సత్యములు  మీకు స్తోత్రం  దానియేలు (4:37)
182. తండ్రి  మీ యొక్క మార్గములన్నియూ న్యాయములైనవి మీకు స్తోత్రం   దానియేలు (4:37)
183. గర్వముతో  ప్రవర్తించువారిని అణపశక్తుడా మీకు స్తోత్రం   దానియేలు (4:37)
184. సింహములు యే  హాని చేయకుండా వాటి నోర్లను మూయించువాడా మీకు స్తోత్రం దానియేలు (6:22)
185. నీవు ఎవరిని రక్షింపగోరుదువో వారిని రక్షించువాడా  మీకు స్తోత్రందానియేలు (5:19)
186. ఎవరిని హెచ్చింప గోరుదువో  వారిని  హెచ్చించువాడా మీకు స్తోత్రం  దానియేలు (5:19)
187. ఎవరిని పడవేయగోరుదువో  వారిని పడగొట్టువాడా మీకు స్తోత్రం  దానియేలు (5:19)
188. జీవముగల దేవా మీకు స్తోత్రం  దానియేలు (5:19)
189. యుగయుగములు ఉండువాడా  మీకు స్తోత్రం దానియేలు (6:26)
190. తండ్రి మీ రాజ్యము నాశనము కానేరదు మీకు స్తోత్రం   దానియేలు (6:26)
191. నన్ను విడిపించువాడా మీకు స్తోత్రం  దానియేలు (6:27)
192. నన్ను రక్షకించువాడా మీకు స్తోత్రం  దానియేలు (6:27)
193. పరమందును భూమిమీదను సూచక క్రియలు చేయువాడా  మీకు స్తోత్రం   దానియేలు (6:27)
194. పరమందును భూమిమీదను ఆశ్చర్యకార్యములు  చేయువాడా  మీకు స్తోత్రం   దానియేలు (6:27)
195. తండ్రి మీ  ప్రభుత్వము శాశ్వతమైనది  మీకు స్తోత్రం   దానియేలు (7:14) 
196. తండ్రి మీ  ప్రభుత్వము  యెన్నటికి తొలగిపోదు  మీకు స్తోత్రం   దానియేలు (7:14)
197. కృపగల దేవా   మీకు స్తోత్రం  దానియేలు (9:9)
198. క్షమాపణలు  గల దేవా   మీకు స్తోత్రం   దానియేలు (9:9)
199. గ్రహింప శక్తి నిచ్చువాడా    మీకు స్తోత్రం  దానియేలు (9:22)
200. క్రీస్తు నందు  పరలోక విషయములో  ఆత్మసంబంధమైన  ప్రతీ  ఆశీర్వాదమును  మాకు అనుగ్రహించినవాడా   మీకు స్తోత్రం ఎఫెసీ(1:3)
201. జగత్పునాది వేయబడక ముందే  ప్రేమ చేత  మమ్ములను  క్రీస్తులో  ఏర్పరచు కున్న దేవా   మీకు స్తోత్రం   ఎఫెసీ(1:6)
202. కరుణా సంపన్నుడా   మీకు స్తోత్రం   ఎఫెసీ(2:5)
203. ప్రేమచేత  మమ్మును  క్రీస్తుతోకూడా  బతికించిన  యేసయ్య  మీకు స్తోత్రం ఎఫెసీ(2:5)
204. కృప చేత  మమ్మును రక్షించిన యేసయ్య మీకు స్తోత్రం ఎఫెసీ(2:5)
205. జ్ఞానమునకు మించిన  క్రీస్తు  ప్రేమకై  మీకు స్తోత్రంఎఫెసీ(3:19)
206. అడుగువాటన్నిటి  కంటెను  ఊహించువాటికంటెను ఆత్యధికముగా చేయు శక్తి  గల దేవా మీకు స్తోత్రం      ఎఫెసీ (3:21)
207. బలాతిశయము  చేత  క్రీస్తును  మృతులలోనుండి లేపిన తండ్రీ మీకు స్తోత్రం    ఎఫెసీ(1:20)
208. అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి, స్తోత్రము (ఎఫెసి 3:21)
209. సంఘమునకు శిరస్సై యున్న క్రీస్తు  మీకు స్తోత్రం ఎఫెసీ(5:23)
210. దేవుని స్వరూపము కలిగిన క్రీస్తు మీకు స్తోత్రం  పిలిప్పీ(2:6)
211. మనుషుల పోలికగా పుట్టిన క్రీస్తు మీకు స్తోత్రం   పిలిప్పీ(2:6)
212. దాసుని స్వరూపము ధరించుకున్న  క్రీస్తు  మీకు స్తోత్రం   పిలిప్పీ(2:6)
213. రిక్తునిగా చేసుకున్న క్రీస్తు మీకు స్తోత్రం  పిలిప్పీ(2:6)
214. సిలువమరణము పొందునంతగా విధేయత చూపిన క్రీస్తు మీకు స్తోత్రం  పిలిప్పీ(2:6)
215. ప్రతీ వాని మోకాలు  నాలుక యేసుక్రీస్తని  ఒప్పుకొనును మీకు స్తోత్రం   పిలిప్పీ(2:10)
216. అధికముగా దేవుని చేత  హెచ్చింపబడిన  క్రీస్తు మీకు స్తోత్రం  పిలిప్పీ(2:11)
217. ప్రతి నామమునకు  పై నామము అనుగ్రహింపబడిన యేసు క్రీస్తు మీకు స్తోత్రం  పిలిప్పీ(2:11)
218. క్రీస్తు యేసు నందు మహిమలో మా ప్రతి అవసరము తీర్చే తండ్రీ  మీకు స్తోత్రం పిలిప్పీ(4:19)
219. అంధకార సంబంధమైన  అధికారము నుండి మమ్ములను  విడుదల చేసిన తండ్రీ మీకు స్తోత్రం  కొలస్సి(1:13)
220. అదృశ్య దేవుడా  మీకు స్తోత్రం   కొలస్సి(1:15)
221. సర్వ సృష్టికి  అది సంభూతుడా  మీకు స్తోత్రం  కొలస్సి(1:15)
222. మమ్ములను నీ కుమారుని  రాజ్య నివాసులుగా  చేసినందుకు మీకు స్తోత్రం  కొలస్సి(1:13)
223. ఆన్నింటి కన్నా  ముందుగా వున్నవాడా మీకు స్తోత్రం  కొలస్సి(1:17)
224. సమస్తమునకునూ  ఆధారభూతుడా మీకు స్తోత్రం  కొలస్సి(1:17)
225. సర్వమును ఆయన ద్వారా  ఆయన బట్టి  సృజింపబడెను తండ్రి మీకు స్తోత్రం  కొలస్సి(1:16)
226. యేసుక్రీస్తు మరణము వలన  మమ్మును  సమాధాన పరచిన  తండ్రీ మీకు స్తోత్రం      కొలస్సి(1:22)
227. నాలో బలముగా  కార్యసిద్ధి  కలుగ జేయు  మీ క్రియా శక్తి కై  తండ్రీ మీకు స్తోత్రం   కొలస్సి(1:29)
228. బుద్ది  జ్ఞాన సర్వ సంపదలు మీ యందే గుప్తమైయున్నవి   తండ్రీ మీకు స్తోత్రం కొలస్సి(2:3)
229. మా జీవము  క్రీస్తుతోకూడా  దేవుని యందు దాచబడినది  తండ్రీ మీకు స్తోత్రం  కొలస్సి(3:3)
230. నమ్మకమైన తండ్రీ   మీకు స్తోత్రం  1దస్సలోనిక(5:24)
231. దేవునికి నరులకు మధ్యవర్తి  మీకు స్తోత్రం  1తిమోతి(2:5)
232. క్రీస్తుయేసు అను నరుడా మీకు స్తోత్రం  1తిమోతి(2:5)
233. పాపులను రక్షించుటకు లోకములోనికి వచ్చిన క్రీస్తు  యేసు మీకు స్తోత్రం  1తిమోతి(1:15)
234. దేవుని వాక్యము బంధింపబడి యుండలేదు తండ్రీ  మీకు స్తోత్రం  2తిమోతి(2:9)
235. పరిశుద్ధమైన పిలుపుకై  తండ్రీ  మీకు స్తోత్రం   2తిమోతి(1:10)
236. మేము నమ్మదగని వారమైనను మీరు నమ్మదగిన వారుగా ఉన్నారు తండ్రీ  మీకు స్తోత్రం  2తిమోతి(2:13)
237. సజీవులకును మృతులకును తీర్పు తీర్చు  యేసుక్రీస్తు మీకు స్తోత్రం 2తిమోతి(4:1)
238. నిత్యజీవమును అబద్ధమాడనేరని  తండ్రీ మీకు స్తోత్రం   తీతు(1:4)
239. మా కొరకు శాపమైన క్రీస్తు మీకు స్తోత్రం  గలతీ(3:14)
240. మమ్ములను ధర్మశాస్రం యొక్క శాపము నుండి  విడిపించిన  క్రీస్తు మీకు స్తోత్రం  గలతీ(3:14)
241. విశ్వాసము వలన దేవుని కుమారులుగా  మమ్మును చేసిన క్రీస్తు మీకు స్తోత్రం   గలతీ(3:26)
242. నాయనా తండ్రీ అని మీ కుమారుని  ఆత్మను మా హృదయములో ఉంచిన తండ్రీ మీకు స్తోత్రం గలతీ(4:6)
243. నీవిక దాసుడవు కావు  కుమారుడవే కుమారుడవైతే  దేవుని ద్వారా వారసుడవు అని చెప్పిన  తండ్రీ మీకు స్తోత్రం   గలతీ(4:7)
244. ఆకోరు లోయను  నిరీక్షణ  ద్వారముగా  చేసే  తండ్రీ మీకు స్తోత్రం హోషయ(2:15)
245. యూదా వారికి కొదమ సింహము వంటి వాడా  మీకు స్తోత్రం హోషయ(5:14)
246. దయ చూపే తండ్రీ  మీకు స్తోత్రం హోషయ(2:19)
247. నీటిని బట్టి తీర్పు తీర్చే తండ్రీ  మీకు స్తోత్రం హోషయ(2:19)
248. ఎప్రాయీమీయులకు సింహము వంటి వాడా  మీకు స్తోత్రం హోషయ(5:14)
249. మమ్ములను స్వస్థపరిచే  తండ్రీ మీకు స్తోత్రం హోషయ(6:1)
250. మమ్ములను బాగు చేసే  తండ్రీ మీకు స్తోత్రం  హోషయ(6:2)
251. నేను బలిని కోరాను గాని కనికరమునే కోరుచున్నాను అని చెప్పిన యెహోవా మీకు స్తోత్రం  హోషయ(6:6)
252. కరుణా వాత్యల్యము గల యెహోవా మీకు స్తోత్రం యోవేలు(2:13)
253. శాంతమూర్తి యెహోవా మీకు స్తోత్రం యోవేలు(2:13)
254. అత్యంత కృప గల యెహోవా మీకు స్తోత్రం  యోవేలు(2:13)
255. మీరు చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చత్తాపపడే యెహోవా మీకు స్తోత్రం  యోవేలు(2:13)
256. మా కొరకు గొప్ప కార్యము చేసిన  యెహోవా మీకు స్తోత్రం యోవేలు(2:21)
257. నా జనులు ఇక యెన్నటికి  సిగ్గు నొందరు  అని చెప్పిన  యెహోవా మీకు స్తోత్రం  యోవేలు(2:26)
258. సర్వజనుల  మీద మీ ఆత్మను కుమ్మరించే యెహోవా మీకు స్తోత్రం   యోవేలు(2:28)
259. మేము తృప్తి  పొందునంతగాధాన్యమును క్రొత్త  ద్రాక్షారసమును  తైలమును మాకు పంపించే యెహోవా మీకు స్తోత్రం యోవేలు(2:19)
260. ఇకను అన్యజనులలో  మమ్మును  అవమానాస్పదముగా  చేయను అని చెప్పిన యెహోవా మీకు స్తోత్రం  యోవేలు(2:19)
261. బలహీనుడు నేను బలవంతుడను అనుకొనవలెను అని చెప్పిన యెహోవా మీకు స్తోత్రం యోవేలు(3:10)
262. సీయోను లోనుండి గర్జించు యెహోవా మీకు స్తోత్రం యోవేలు(3:16)
263. తన జనులకు ఆశ్రయమైన యెహోవా మీకు స్తోత్రం యోవేలు(3:16)
264. మా దేవుడవైన యెహోవా మీకు స్తోత్రం యోవేలు(3:17)
265. తన సేవకులైన ప్రవక్తలను తాను సంకల్పించిన దానిని బయలు పరచకుండా ఏమి చేయని యెహోవా మీకు స్తోత్రం ఆమోసు(3:7)
266. రాజులకు రాజా  మీకు స్తోత్రం ప్రకటన(19:16)
267. ప్రభువులకు ప్రభు మీకు స్తోత్రం   ప్రకటన(19:16)
268. సప్త ఋషీ నక్షత్రములను  మృగ శీర్షా  నక్షత్రములను  సృష్టించిన యెహోవా మీకు స్తోత్రం  ఆమోసు(5:18)
269. కారు చీకటిని ఉదయముగా మార్చు యెహోవా మీకు స్తోత్రం   ఆమోసు(5:18)
270. మా మధ్యన సంచరించు యెహోవా  మీకు స్తోత్రం  ఆమోసు(5:16)
271. మాకు తోడుగా ఉన్న యెహోవా యెహోవా మీకు స్తోత్రం  ఆమోసు(5:14)
272. మా మీద సాక్షఖము పలుకు యెహోవా యెహోవా మీకు స్తోత్రం   మీకా(1:2)
273. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోవు యెహోవా మీకు స్తోత్రం  మీకా(1:3)
274. మీరు నడవగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును యెహోవా మీకు స్తోత్రం  మీకా(1:4)
275. మాకు నాయకుడవైన  యెహోవా  మీకు స్తోత్రం  మీకా(2:13)
276. మాకు ముందుగా వెళ్లి ప్రాకారములు పగులగొట్టు యెహోవా  మీకు స్తోత్రం  మీకా(2:13)
277. మాకు ముందుగా నడుచు రాజా  మీకు స్తోత్రం  మీకా(2:13)
278. సమాధానానికి కారకుడా  మీకు స్తోత్రం  మీకా(5:5)
279. యెహోవా మీ హస్తము మీ విరోధులమీద ఎత్తబడి ఉండును గాక మీకా(5:9)
280. యెహోవా మీ హస్తము మా  విరోధులమీద ఎత్తబడి ఉండును గాక  
281. యెహోవా నీ శత్రువులు నశించుదురు గాక మీకా(5:9)
282. యెహోవా నా శత్రువులు (సాతాను దూతలు)  నశించుదురు గాక 
283. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమగుచుండె యెహోవా మీకు స్తోత్రం   మీకా(5:3)
284. నా ప్రార్ధన ఆలకించు దేవా  మీకు స్తోత్రం మీకా(7:7)
285. నీ మాటలు ఆలకించని జనములకు  ప్రతీకారము చేయు దేవా  మీకు స్తోత్రం మీకా(5:15)
286. కనికరము చూపుటయందు  సంతోషించు యెహోవా మీకు స్తోత్రం మీకా(7:18)
287. నిరంతరము కోపముంచని దేవా  మీకు స్తోత్రం మీకా(7:18)
288. మా యందు జాలి పడు దేవా  మీకు స్తోత్రం మీకా(7:19)
289. మా దోషములను అణచివేయువాడా  మీకు స్తోత్రం మీకా(7:19)
290. మా పాపములను సముద్ర అగాధములో పడవేయు దేవా  మీకు స్తోత్రం మీకా(7:19)
291. మా అతిక్రమములను క్షమించు దేవా మీకు స్తోత్రంమీకా(7:18)
292. సత్యమును కనికరమును అనుగ్రహించువాడా  మీకు స్తోత్రం మీకా(7:20)
293. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు  ప్రమాణము చేసిన  దేవా  మీకు స్తోత్రం మీకా(7:20)
294. తన శత్రువులకు ప్రతీకారము చేయు యెహోవా మీకు స్తోత్రం  నహుము(1:2)
295. మా శత్రువులకు ప్రతీకారము చేయు యెహోవా మీకు స్తోత్రం 
296. యెహోవా దీర్ఘశాంతుడు మీకు స్తోత్రం  నహుము(1:3)
297. యెహోవా మహా బలము కలవాడు మీకు స్తోత్రం  నహుము(1:3)
298. దోషులను నిర్దోషులుగా యెంచని యెహోవా మీకు స్తోత్రం   నహుము(1:3)
299. తుఫానులోనుండి  సుడిగాలిలోనుండి వచ్చు యెహోవా మీకు స్తోత్రం  నహుము(1:3)
300. యెహోవా ఉత్తముడు మీకు స్తోత్రం  నహుము(1:6)
301. మేఘములను పాదదూళిగా చేసుకున్న యెహోవా మీకు స్తోత్రం నహుము(1:3)
302. సముద్రమును గద్దించి ఆరిపోజేసిన దేవా మీకు స్తోత్రం నహుము(1:4)
303. నదులన్నిటిని ఎండిపోజేసిన దేవా మీకు స్తోత్రం నహుము(1:4)
304. మీకు బయపడి పర్వతములు కంపించును దేవా మీకు స్తోత్రం  నహుము(1:5)
305. మీకు బయపడి కొండలు కరిగిపోవును దేవా మీకు స్తోత్రం  నహుము(1:5)
306. మీ యెదుట భూమి కంపించును దేవా మీకు స్తోత్రం  నహుము(1:5)
307. శ్రమ దినమందు ఆశ్రయ దుర్గమైన మా యెహోవా మీకు స్తోత్రం  నహుము(1:7)
308. తన శత్రువులు అంధకారములో దిగు వరకు వారిని తరిమే యెహోవా మీకు స్తోత్రం  నహుము(1:8)
309. మా కట్లను తెంపు యెహోవా మీకు స్తోత్రం  నహుము(1:14)
310. సముద్రము జలములతో నిండి యున్నట్లు  భూమి యెహోవా మహాత్యమును గూర్చిన  జ్ఞానముతో  నిండి యున్నది దేవా మీకు స్తోత్రం  హబక్కుకు(2:14)
311. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచు యెహోవా మీకు స్తోత్రం   హబక్కుకు(3:2)
312. మీ కార్యములు మాకు  తెలియజేయు యెహోవా మీకు స్తోత్రం   హబక్కుకు(3:2)
313. యెహోవా మహిమ ఆకాశమండలము అంతయూ కనబడుచున్నది మీకు స్తోత్రం హబక్కుకు(3:3)
314. భూమి మీ  ప్రభావముతో నిండియున్నది యెహోవా మీకు స్తోత్రం  హబక్కుకు(3:3)
315. మీ పాదముల వెంట అగ్ని మెరుపులు  వచ్చుచున్నవి యెహోవా మీకు స్తోత్రం  హబక్కుకు(3:5)
316. నీ బాణముల  కాంతికి బయపడి సూర్యచంద్రులు తమ నివాసములో ఆగిపోవుదురు యెహోవా మీకు స్తోత్రం  హబక్కుకు(3:11)
317. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుదువు యెహోవా మీకు స్తోత్రం  హబక్కుకు(3:13)
318. యెహోవా నా బలమా  మీకు స్తోత్రం  హబక్కుకు(3:19)
319. నా కాళ్ళను లేడి  కాళ్ళవలె  చేయు దేవా మీకు స్తోత్రం హబక్కుకు(3:19)
320. ఉన్నత స్థలముల మీద నన్ను నడవజేయు  యెహోవా మీకు స్తోత్రం  హబక్కుకు(3:19)
321. యెహోవా నీవు అక్రమము  చేయువాడవు కావు మీకు స్తోత్రం  జెఫన్యా(3:5)
322. మాకు విధించిన శిక్షను  కొట్టివేసిన యెహోవా మీకు స్తోత్రం  జెఫన్యా(3:15)
323. మా యెడల మీకున్న ప్రేమకై మీకు స్తోత్రం జెఫన్యా(3:17)
324. యెహోవా శక్తి మంతుడు మీకు స్తోత్రం జెఫన్యా(3:17)
325. మా యెడల శాంతము  వహించు జెఫన్యా(3:17)
326. మా యందలి  సంతోషము చేత  హర్షించు యెహోవా మీకు స్తోత్రం   జెఫన్యా(3:17)
327. నన్ను హింస పెట్టు వారినందరిని శిక్షించు యెహోవా మీకు స్తోత్రం  జెఫన్యా(3:19)
328. మాకు తోడుగా ఉన్న యెహోవా మీకు స్తోత్రం హగ్గయి(1:13)
329. మా మధ్య ఉన్న మీ ఆత్మకై యెహోవా మీకు స్తోత్రం  హగ్గయి(2:5)
330. ఇది మొదలుకొని  మమ్మును  ఆశీర్వదించు యెహోవా  మీకు స్తోత్రం  హగ్గయి(2:19)
331. మిమ్మును ముట్టిన వాడు తన కనుగుడ్డును ముట్టినవాడు అని చెప్పిన యెహోవా మీకు స్తోత్రం  జెకర్యా(2:8)
332. మీ సన్నిధిని నిలుచు భాగ్యము మా కిచ్చే యెహోవా మీకు స్తోత్రం జెకర్యా(3:7)
333. యెహోవా మీ కృపకై  మీకు స్తోత్రం  జెకర్యా(4:7)
334. కృప కలుగును గాక  కృప కలుగును గాక  జెకర్యా(4:7)
335. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక  నా ఆత్మ చేతనే  జరుగునని చెప్పిన యెహోవా మీకు స్తోత్రం జెకర్యా(4:7)
336. భయపడక  ధైర్యము తెచుకొనుడని చెప్పిన యెహోవా మీకు స్తోత్రం  జెకర్యా(8:13)
337. మమ్ములను కాపాడు యెహోవా మీకు స్తోత్రం  జెకర్యా(9:15)
338. నీతిపరుడా యెహోవా మీకు స్తోత్రం జెకర్యా(9:9)
339. రక్షణ కలవాడా యెహోవా మీకు స్తోత్రం జెకర్యా(9:9)
340. దీనుడా యెహోవా మీకు స్తోత్రం జెకర్యా(9:9)
341. మమ్ములను దర్శించు యెహోవా మీకు స్తోత్రం  జెకర్యా(10:3)
342. మమ్ములను బలసారులుగా చేసే యెహోవా మీకు స్తోత్రం  జెకర్యా(10:12)
343. దుఃఖ  సముద్రములను దాటి  సముద్ర తరంగములను అణచివేయు యెహోవా మీకు స్తోత్రం  జెకర్యా(10:11)
344. ఆకాశమండలమును విశాలపరచిన యెహోవా మీకు స్తోత్రం  జెకర్యా(12:1)
345. భూమికి పునాది వేసిన యెహోవా మీకు స్తోత్రం జెకర్యా(12:1)
346. మనుషుల  అంతరంగములో  జీవాత్మను సృజించు యెహోవా మీకు స్తోత్రం జెకర్యా(12:1)
347. సంరక్షకుడా యెహోవా మీకు స్తోత్రం జెకర్యా(12:8)
348. మా మొరను ఆలకించు  యెహోవా  మీకు స్తోత్రం జెకర్యా(13:9)
349. మమ్ములను మీ జనములని  చెప్పు యెహోవా మీకు స్తోత్రం  జెకర్యా(13:9)
350. సర్వలోకములకు రాజా మీకు స్తోత్రం జెకర్యా(14:9)
351. యెహోవా ఒక్కడే మీకు స్తోత్రం జెకర్యా(14:9)
352. ఘనమైన మహా రాజా మీకు స్తోత్రం  మలాకీ(1:14)
353. భయంకరమైన  మీ నామమునకై  యెహోవా మీకు స్తోత్రం మలాకీ(1:14)
354. మనకందరికీ  తండ్రీ  ఒక్కడే యెహోవా మీకు స్తోత్రం మలాకీ(2:10)
355. నిబంధన దూత యెహోవా మీకు స్తోత్రం మలాకీ(3:1)
356. మార్పులేని  వాడా యెహోవా మీకు స్తోత్రం మలాకీ(3:6)
357. కంసాలి అగ్ని వంటివాడా యెహోవా మీకు స్తోత్రం మలాకీ(3:2)
358. తండ్రి  తనను సేవించు కుమారుని కనికరించునట్లు  మమ్ములను కనికరించు యెహోవా  మీకు స్తోత్రం మలాకీ(3:17)
359. నీతి సూర్యుడా యెహోవా  మీకు స్తోత్రం మలాకీ(4:2)
360. మాకు ఆరోగ్యము కలుగజేయు మీ రెక్కల కొరకై యెహోవా  మీకు స్తోత్రం  మలాకీ(4:2)
361. చాకలి వాణి సబ్బు వంటి  యెహోవా  మీకు స్తోత్రం మలాకీ(3:2)
362. యుగయుగములు సజీవుడవై ఉన్న దేవా   మీకు స్తోత్రం 
363. యెహోవా మీకే జయము 
364. యెహోవా మీకే విజయము
365. యెహోవా మీకే జేజేలు 
366. యెహోవా మీకే జై జై జై 
367. యెహోవా మీకే కీర్తి కలుగును గాక 
368. జీవము గల తండ్రీ మీకు స్తోత్రం 
369. కృపామయుడా మీకు స్తోత్రం 
370. కనికర సంపన్నుడా మీకు స్తోత్రం 
371. మాకు వ్యతిరేకముగా పనిచేయుచున్న సాతాను దూతలకు మీరు సిద్ధపరచిన నరకాన్ని బట్టి  మీకు వందనాలు 
372. అపవాదికి మీరు సిద్ధపరచిన అగ్ని గంధకాల గుండమును బట్టి  మీకు వందనాలు 
373. పరిశుద్దుడా మీకు స్తోత్రం 
374. మంచి కాపరి  మీకు స్తోత్రం 
375. ప్రధాన కాపరి మీకు స్తోత్రం 
376. పర లోకమందున్న మా తండ్రీ  మీకు స్తోత్రం  మత్తయి(6:9)
377. రహస్యమందు చూచు తండ్రి మీకు స్తోత్రం  మత్తయి(6:6)
378. ప్రవక్తకంటెగొప్పవాడా మీకు స్తోత్రం       మత్తయి (11:9)
379. సాత్వీకుడా      మీకు స్తోత్రం          మత్తయి(11:29)
380. దీనమనస్సు కలవాడా      మీకు స్తోత్రం               మత్తయి(11:29)
381. విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నవాడా మీకు స్తోత్రం      మత్తయి(12:8)
382. మనుష్య కుమారుడా  మీకు స్తోత్రం         మత్తయి(12:8)
383. యోనాకంటె గొప్పవాడా    మీకు స్తోత్రం    మత్తయి(12:42)
384. సొలొమోనుకంటె గొప్పవాడా మీకు స్తోత్రం     మత్తయి(12:42)
385. దావీదు కుమారుడా    మీకు స్తోత్రం            మత్తయి(20:31)
386. దావీదు కుమారునికి  జయము       మత్తయి(21:9)
387. ప్రభువు పేరిట వచ్చువాడు  స్తుతించబడునుగాక   మత్తయి(21:9)
388. సర్వోన్నతమైన స్థలములలో  జయము    మత్తయి(21:9)
389. యూదులరాజా  నీకు శుభము  మత్తయి(27:29)
390. దేవుని కుమారుడా   మీకు స్తోత్రం        మత్తయి(27:55)
391. యుగసమాప్తి వరకు సదా కాలము  మాలో ఉన్నదేవా మీకు స్తోత్రం  మత్తయి(29:20)
392. దేవుని పరిశుద్దుడా    మీకు స్తోత్రం    మార్కు(1:24)
393. క్రీస్తూ        మీకు స్తోత్రం               మార్కు(8:29)
394. ప్రియకుమారుడా  మీకు స్తోత్రం          మార్కు(9:7)
395. హాసన్నా       మీకు స్తోత్రం            మార్కు(11:9)
396. సత్యవంతుడా     మీకు స్తోత్రం         మార్కు(12:14)
397. మొహమాటం లేనివాడా మీకు స్తోత్రం   మార్కు(12:14)
398. ఎవనిని లక్ష్యపెట్టని వాడా మీకు స్తోత్రం మార్కు(12:14)
399. అబ్రాహాము దేవా  మీకు స్తోత్రం  మార్కు(12:24)
400. ఇస్సాకు దేవా     మీకు స్తోత్రం   మార్కు(12:24)
401. యాకోబు దేవా  మీకు స్తోత్రం   మార్కు(12:24)
402. అద్వితీయ ప్రభువా  మీకు స్తోత్రం  మార్కు(12:29)
403. గొర్రెలకాపరి    మీకు స్తోత్రం   మార్కు(14:27)
404. పరమాత్ముని కుమారుడా  మీకు స్తోత్రం    మార్కు(14:6)
405. గొప్పవాడా   మీకు స్తోత్రం  లూకా(1:32)
406. సర్వోన్నతుని కుమారుడా   మీకు స్తోత్రం   లూకా(1:32)
407. శక్తిమంతుడా మీకు స్తోత్రం   లూకా(3:16)
408. ప్రభుత్వము కంటె గొప్పవాడా  మీకు స్తోత్రం    లూకా(7:26)
409. ప్రవక్తకంటె గొప్పవాడా  మీకు స్తోత్రం. లూకా (7:26)
410. సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను
411. తండ్రీ మీ నామము పరిశుద్ధము మీకు స్తోత్రం   . 
412. మీకు భయపడువారిమీద ఆయన కనికరము తర తరములకుండును తండ్రీ మీకు స్తోత్రం  . 
413. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను తండ్రీ మీకు స్తోత్రం
414. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టె తండ్రీ మీకు స్తోత్రం  . 
415. సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించె తండ్రీ  మీకు స్తోత్రం
416. ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచిన తండ్రీ మీకు స్తోత్రం
417. అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతమువరకు తన కనికరము చూపిన తండ్రీ  మీకు స్తోత్రం
418. ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెన తండ్రీ  మీకు స్తోత్రం లూకా(1:49-55)
419. మా శత్రువుల చేతినుండి మమ్ములను విడిపించిన తండ్రీ  మీకు స్తోత్రంలూకా(1:75) 
420. పరలోకమందు సమాధానము ఉండును గాక  లూకా(19:38)
421. సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక  లూకా(19:38)
422. ఆదియందు వాక్యముండెనుతండ్రీ  మీకు స్తోత్రం  , యోహాను (1:1) 
423. వాక్యము దేవుని యొద్ద ఉండెను తండ్రీ  మీకు స్తోత్రం  ,  యోహాను (1:1) 
424. వాక్యము దేవుడై యుండెను తండ్రీ మీకు స్తోత్రం  . యోహాను (1:1)
425. బోధకుడా  తండ్రీ  మీకు స్తోత్రం  యోహాను (1:49)
426. తండ్రీ మీరు లోకమును ఎంతో ప్రేమించారు  మీకు స్తోత్రం  
427. మేము నశింపక నిత్యజీవము పొందునట్లు యేసయ్యను అనుగ్రహించిన తండ్రీ మీకు స్తోత్రం  . యోహాను (3:16)
428. తండ్రీ మీరు హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసి యున్నది  మీకు స్తోత్రం  యోహాను (3:30) 
429. తండ్రీ మీరు పరిపూర్ణతలోనుండి మేమందరము కృప వెంబడి కృపను పొందితివిు  మీకు స్తోత్రం . యోహాను (1:16) 
430. కొలతలేకుండ ఆత్మననుగ్రహించు తండ్రీ  మీకు స్తోత్రం యోహాను (3:34) 
431. నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు యేసయ్య  మీకు స్తోత్రం   యోహాను (6:68)  
432. నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేని తండ్రీ  మీకు స్తోత్రం  . యోహాను (8:29) 
433. గొఱ్ఱలకు మంచి కాపరి  మీకు స్తోత్రం యోహాను (10:11)  
434. గొఱ్ఱలకొరకు ప్రాణము పెట్టిన యేసయ్య  మీకు స్తోత్రం  యోహాను (10:11) 
435. తండ్రి తో  ఏకమై యున్న యేసయ్య  మీకు స్తోత్రం    .  యోహాను (10:30) 
436. పునరుత్థానమును జీవమును యేసయ్య మీరే  మీకు స్తోత్రం  ; యోహాను (11:25)  
437. మీ యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును  మీకు స్తోత్రం ;  యోహాను (11:25) 
438. మేము ఫలించుటకును, మమ్మును ఏర్పరచుకొన్న యేసయ్య  మీకు స్తోత్రం  . యోహాను (15:16)  
439. మా ఫలము నిలిచియుండుటకును మమ్మును ఏర్పరచుకొని నియమించిన యేసయ్య  మీకు స్తోత్రం . యోహాను (15:16) 
440. మా దుఃఖము సంతోషమగునని చెప్పిన యేసయ్య మీకు స్తోత్రం  . యోహాను (16:20) 
441. యూదుల రాజా,  మీకు శుభము     యోహాను (19:3)  
442. గొఱ్ఱల కాపరి  మీకు స్తోత్రం . యోహాను (10:2) 
443. గొఱ్ఱలు పోవు ద్వారమా  మీకు స్తోత్రం   ; యోహాను (10:7) 
444. మీ మాటలు ఆత్మయు జీవమునై యున్నవి యేసయ్య మీకు స్తోత్రం  , యోహాను (6:63)
445. దేవుని పిల్లలగుటకు మాకు అధికారము అనుగ్రహించిన యేసయ్య యేసయ్య మీకు స్తోత్రం . యోహాను (1:12) 
446. లేఖనములు గ్రహించునట్లుగా  నా మనసును తెరచిన యేసయ్య  మీకు స్తోత్రం   లూకా సువార్త (24:45)
447. కాలములను సమయములను  స్వాధీనమందుంచుకొన్న తండ్రి మీకు స్తోత్రం . అపొస్తలుల కార్యములు  (1:7) 
448. పైన ఆకాశమందు మహత్కార్యములను కలుగజేసే తండ్రి యేసయ్య మీకు స్తోత్రం.  అపొస్తలుల కార్యములు  (2:19) 
449. క్రింద భూమిమీద సూచకక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసే తండ్రి మీకు స్తోత్రం అపొ కార్యములు  (2:19)
450. మరణము మిమ్మును బంధించి యుంచుట అసాధ్యము యేసయ్య  మీకు స్తోత్రం  అపొ కార్యములు  (2:24)

Thursday, February 17, 2022

AFC Songs

 AFC LYRICS

నీవే కృపాదారము త్రియేక దేవా | Nevey Krupadaramu song lyrics

AFC LYRICS

నీవే కృపాదారము త్రియేక దేవా
నీవే క్షేమాదారము నా యేసయ్య } 2
నూతన బలమును నవనూతన కృపను } 2
నేటి వరకు దయచేయుచున్నావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే కృపాదారము ||

ఆనందించితిని అనురాగబంధాల
ఆశ్రయపురమైన నీలో నేను } 2
ఆకర్షించితిని ఆకాశముకంటే
ఉన్నతమైననీ ప్రేమను చూపి } 2
ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి
ఆవేదనల అగ్నిజ్వాలలో అండగానిలచితివి
ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా
ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే కృపాదారము ||

సర్వకృపానిధి సీయోను పురవాసి
నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి } 2
సిలువను మోయుచు నీ చిత్తమును
నెరవేర్చెదను సహనముకలిగి } 2
శిధిలముకానీ సంపదలెన్నో నాకైదాచితివీ
సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి
సర్వశక్తిగల దేవుడవై నడిపించుచునావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా|| నీవే కృపాదారము ||

ప్రాకారములను దాటించితివి
ప్రార్థన వినెడి పావనమూర్తివి } 2
పరిశుద్దులతో నన్ను నిలిపితివి
నీ కార్యములను నూతన పరచి } 2
పావనమైన జీవనయాత్రలో విజయము నిచ్చితివి
పరమ రాజ్యమును నిలుపుట కొరకు అభిషేకించితివి
పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే కృపాదారము |

Wednesday, February 16, 2022

నిజమైన ద్రాక్షావళ్లి నీవే | Nijamaina Draskhavalli Nevey song lyrics

AFC LYRICS
నిజమైన ద్రాక్షావళ్లి నీవే
నిత్యమైన సంతోషము నీతోనే
శాశ్వతమైనది ఎంతో మధురమైందీ
నాపైన నీకున్నప్రేమ - ఎనలేని నీప్రేమ

అతికాంక్షనీయుడా దివ్యమైన నీరూపులో
జీవించుచున్నాను నీప్రేమకు నే పత్రికగా
శిథిలమైయుండగా నన్ను నీదురక్తముతో కడిగి
నీ పొలికగా మార్చినావే నా యేసయ్య

నిజమైన ద్రాక్షావళ్లి నీవే
నిత్యమైన సంతోషము నీతోనే
శాశ్వతమైనది ఎంతో మధురమైందీ
నాపైన నీకున్నప్రేమ - ఎనలేని నీప్రేమ

నా ప్రాణాప్రియుడా శ్రేష్ఠమైన ఫలములతో
అర్పించుచున్నాను సర్వమునీకే అర్పణగా
వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు
జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్య

నిజమైన ద్రాక్షావళ్లి నీవే
నిత్యమైన సంతోషము నీతోనే
శాశ్వతమైనది ఎంతో మధురమైందీ
నాపైన నీకున్నప్రేమ - ఎనలేని నీప్రేమ

శాలేమురాజ రమ్యమైన సీయోనుకే
నను నడిపించుము నీచిత్తమైన మార్గములో
అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి
ఆధారణకర్తవై నను చేర్చుము నీ రాజ్యములో

నిజమైన ద్రాక్షావళ్లి నీవే
నిత్యమైన సంతోషము నీతోనే
శాశ్వతమైనది ఎంతో మధురమైందీ
నాపైన నీకున్నప్రేమ - ఎనలేని నీప్రేమ

AFC MANNA


AFC LYRICS

Saturday, February 12, 2022

Friday, February 11, 2022

దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా | Dhinuda ajeyuda song lyrics

https://afclyrics.blogspot.com/


పల్లవి : దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా
పూజ్యుడా పరిపూర్ణుడా - ఆనంద నిలయమా
జీవదాతవు నీవని శృతిమించి పాడనా 
జీవధారవు నీవని కానుకనై పూజించనా
 అక్షయ దీపము నీవే - నా రక్షణ శృంగము నీవే 
స్వరార్చనచేసెద నీకే - నా స్తుతులర్పించెద నీకే 

1 : సమ్మతిలేని సుడిగుండాలు - ఆవరించగా 
గమనములేని పోరాటాలే - 
తరుముచుండగా నిరుపేదనైనా నా యెడల 
- సందేహమేమీ లేకుండా 
హేతువేలేని-ప్రేమచూపించి -
సిలువచాటునే దాచావు 
సంతోషము నీవే - అమృత సంగీతము నీవే 
స్తుతిమాలిక నీకే - వజ్రసంకల్పము నీవే            "దీనుడా "

2 : సత్య ప్రమాణము నెరవేర్చుటకే - మార్గదర్శీవై 
నిత్యనిబంధన నాతోచేసిన - సత్యవంతుడా
విరిగి నలిగినా మనస్సుతో - హృదయార్చనే చేసెద 
కరుణనీడలో - కృపావాడలో - నీతోవుంటే చాలయ్య
కర్తవ్యము నీవే - కనుల పండుగ నీవేగా 
 విశ్వాసము నీవే - విజేయశిఖరము నీవేగా      " దీనుడా "

3 : ఊహకందని ఉన్నతమైనది - దివ్యనగరమే 
స్ఫటికము పోలిన సుందరమైనది -  నీరాజ్యమే
ఆ నగరమే లక్షమై - మహిమాత్మతో నింపినావు 
అమరలోకానా - నీ సన్నిధిలో - క్రొత్త కీర్తనేపాడెదను 
 ఉత్సహము నీవే - నయన్తోత్సవము నీవేగా 
ఉల్లసము నీలో - ఊహాలపల్లకి నీవేగా            " దీనుడా "

స్తుతి పాడుటకే బ్రతికించిన | Stuti Paduta key bratikinchina



పల్లవి:  స్తుతి పాడుటకే బ్రతికించిన

 జీవనదాతవు నీవేనయ్యా

         ఇన్నాళ్లుగా నన్ను పోషించినా

         తల్లివలె నన్ను ఓదార్చినా

         నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా  - 2

          జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా

         నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును




  1 . ప్రాణభయమును తొలగించినావు

         ప్రాకారములను స్థాపించినావు

                        సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు  -2

         నీ కృపా బాహుళ్యమే-వీడని అనుబంధమై

                        తలచిన ప్రతిక్షణమున-నూతన బలమిచ్చెను  ||  స్తుతి ॥




  2 . నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు

    కనుమరుగాయెను నా దుఖ:దినములు

                కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు -2 

     నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై

                   నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను.  ॥ స్తుతి ॥




   3. హేతువులేకయే ప్రేమించినావు

       వేడుకగా ఇల నను మార్చినావు

       కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు -2

       నీ ప్రేమ మాధుర్యమే- నా నోట స్తుతిగానమై

                            నిలిచిన ప్రతిస్థలమున -పారెను సెలయేరులై          ॥ స్తుతి ॥

Monday, February 7, 2022

ముఖ దర్శనం చాలయ్యా సాంగ్ | Mukha Darshnam Chalayya Song lyrics

ముఖ దర్శనం చాలయ్యా
నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
సమీపించని తేజస్సులో నివసించు
నా దైవమా (2)
నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
యేసయ్యా యేసయ్యా 
యేసయ్యా యేసయ్యా (2)

1. అన్న పానములు మరచి నీతో గడుపుట
పరలోక అనుభవమే
నాకది ఉన్నత భాగ్యమే (2)
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా (2)

2. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది
మహిమలో చేరుటయే
అది నా హృదయ వాంఛయే (2)
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా (2)

3. కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి
గానము చేసేదను
ప్రభువా నిత్యము స్తుతియింతును (2)
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా (2) ||ముఖ||

Thursday, February 3, 2022

Praise the Lord 🙏

బైబిల్ లో కొన్ని పేర్లకు అర్థాలు

 ⭐⭐⭐⭐⭐⭐⭐

బైబిల్ లో కొన్ని పేర్లకు అర్థాలు


📎ఆదాము - ఎఱ్ఱనివాడు, నిర్మింపబడినవాడు.

📎అబ్రాము - గౌరవనీయుడగు తండ్రి.

📎హానోకు - ప్రతిష్టింపబడినవాడు.

📎నోవాహు - నెమ్మది 

📎ఇస్సాకు- నవ్వు.

📎యాకోబు-మోసపుచ్చు

వాడు. 

📎కయీను -పొందుట; 

📎హేబేలు-ఆవిరి.

📎ఏసావు-వెంట్రుకలు గలవాడు. 

📎యోసేపు-అభివృద్ధి ;

📎షెతు-బదులుగా ఇవ్వబడినవాడు; 

📎అబ్రహాము- అనేక జనములకు తండ్రి. 

📎బయర్షెబా -ప్రమాణపు బావి. 

📎బేతేలు-దేవుని ఇల్లు;

📎హెబ్రోను -సహవాసం.

📎హవ్వ -జీవము

📎లేయ -అడవి ఆవు. 

📎రాహేలు -ఆడగొర్రె; 

📎శారాయి-జగడగొండి; శారా-రాజమారి

📎రిబ్కా- ఉచ్చుతాడు

📎దీనా -న్యాయపు తీర్పు

📎తామారు-ఈతచెట్టు.

📎షేము- పేరు,నామము; 

📎హాము-అల్లకల్లోలం, నల్లనివాడు; 

📎హాగరు-యాత్రికురాలు,సంచరించుట.

📎మెల్కిసేదెకు-నీతిరాజు,

📎షాలేము యాజకుడైన రాజు; 

📎మెతూషెల -ఈటే గలవాడు.

📎ఎఫ్రాయిము-రెండంతలువృద్ధి, ఫలము

📎ఎఫ్రాతా -ఫలవంతమైన స్థలం.

📎ఏదేను- ఉల్లాసము; 

📎నిమ్రోదు- తిరుగుబాటు, దైవ ద్రోహి. 

📎ఎనోషు- మానవుడు; 

📎బాబేలు- గందరగోళం.

📎మోషే -నీటి నుండి రక్షించబడినవాడు.

📎అహరోను - కాంతిగల.

📎మిర్యాము - తిరుగుబాటు.

📎అమ్రాము - అనుభవం లేనివాడు.

📎యోకేబేదు - యెహోవా మహాత్యముగలవాడు.

📎సిప్పోరా - పిచ్చుక.

📎రఘుయేలు - ప్రియుడు. 

📎గెర్షోము - పరదేశి. 

📎మార - చేదు.

📎మన్నా - ఇది ఏమిటి (దివ్యమైనఆహారము).

📎యెహోవా నిస్సి - ధ్వజము.

📎ఎలియేజరు - దేవసహాయం. 

📎మస్సా - శోధించుట.

📎మోరిభా - వాదాము.

📎బెసలేలు - దేవుని నీడలో

📎నాదాబు- దాతృత్వం గలవాడు, ఇష్టపూర్వకంగా ఇచ్చువాడు.

📎అభిహూ - ఆయనే నా తండ్రి. 

📎యాజకులు - దేవునికి ప్రజలకు మధ్య వర్తి.

📎అహరోను - వెలుగునిచ్చు వాడు.

📎అభిరాము - తండ్రి హెచ్చించబడును, ఉన్నతమైనతండ్రి.

📎కాలేబు - కుక్క

📎కాదేషు బర్నెయా - ప్రతిష్టితము

📎అహరోను - కాంతిగల

📎అబీరాము -  తండ్రి హెచ్చించబడును 

📎అరామీ దేశము - సిరియా దేశము 

📎సీనాయి (హోరేబు) - చంద్ర దేవతకు సంబంధించినది

📎యెహోషువా - యెహోవాయే రక్షణ

📎రహాబు - విశాలత లేక గర్వము

📎ఆకాను - ప్రజలను బాదించువాడు

📎ఆకోరులోయ - బాధలోయ

📎షీలోహు - నెమ్మది లేక శాంతి

📎కెదెషు - పరిశుద్ధమైనది

📎షెకెము - బుజము

📎హెబ్రోను - సహవాసము

📎బేసెరు - దుర్గము (లేక) యుద్ధముయొక్క బలములు

📎రామోతు - ఉన్నత స్థలము

📎గోలాను - చుట్టు ప్రదేశము, ఆనందము

📎హోర్మా - నిషిద్ధపట్టణము 

📎బెతేమెష్ - సూర్యనివాసము 

📎ఒత్నీయేలు - దేవుని సింహము 

📎కిర్యత్సేఫెరు - గ్రంథనగరము 

📎ఆరాము - ఎత్తైనస్థలము

📎కూషున్రిషాతాయిము -  రెట్టింపు దుర్మార్గపు చీకటి

📎కెనజు -  దేవుని శక్తిమీద ఆధారపడిన వ్యక్తి

📎ఎలీమెలేకు - దేవుడే నా రాజు

📎బెత్లెహేము - రొట్టెల ఇల్లు

📎మోయాబు - నా తండ్రి నుండి

📎మహ్లోనూ - వ్యాధిగ్రస్తుడు

📎కిల్యోను - క్షీణించుచున్న

📎ఓర్పా - మెడ వంచని లేక జడలు గలది

📎రూతు - సంతృప్తి లేక స్నేహము

📎నయోమి - మధురమైన

📎మారా - చేదు

📎బోయజు - బలవంతుడు

📎ఓబేదు - సేవకుడు

📎ఎల్కానా - దేవుడు సృజించెను

📎హన్నా - కృప 

📎పెనిన్నా - పగడము 

📎సమూయేలు - దేవుని అడిగితిని, దేవుడు వినెను

📎ఎలీ - ఎత్తు

📎హోఫ్నీ - పిడికిలి సంబంధించిన 

📎సౌలు - దేవునివలన అనుగ్రహింపబడినవాడు

📎షీలోహు - నెమ్మది లేక విశ్రాంతి

📎ఈకాబోదు - ప్రభావము పోయెను

📎మిస్పా - కావాలి గోపురము

📎మత్తయి- యెహోవా దానము

📎యేసు- రక్షకుడు

📎క్రేస్తు- అభిషక్తుడు

📎యోసేపు- కూడబెట్టుట

📎మరియ- చేదు, తిరుగుబాటు

📎హేరోదు- శూరుడు

📎యోహాను- యెహోవాకృప

📎పరిసయ్యులు- ప్రత్యేకింపబడినవారు

📎సద్దుకయులు- నీతిమంతులు

📎బెత్సయిదా- వలలస్థలము

📎ఫిలిప్పి- ఆశ్రయప్రియుడు, గుఱ్ఱములను ప్రేమించువాడు

📎హీరోదియా- శూరురాలు

📎గలిలయ- గుండ్రని వలయము

📎ఒలివకొండ- వనము

📎బరబ్బా- తండ్రియొక్క కుమారుడు

📎గోల్గోత- కాపాల స్థలము.

📎యేసు - రక్షకుడు 

📎మార్కు - మాదిరి 

📎పిలాతు - క్రీస్తును సిలువవేసినవాడు

📎హేరోదు - శూరుడు

📎దెకపొలి - 10 పట్టణాలు 

📎బోయనెర్గెసు - ఉరిమెడివారు 

📎తలితాకుమి - చిన్నదానలెమ్ము 

📎బేతనియ - బీదలనివాసము, ఖర్జూరపుపండ్లఉనికి

📎నజరేతు - చిగురు, రక్షించును

📎యెరికో - సువాసనగలస్థలము

📎బెత్లెహేము - రొట్టెలఇల్లు 

📎కైసరు - రోమా చక్రవర్తుల ఉద్యోగ బిరుదు 

📎లాజరు - దేవుడే నా సహాయము 

📎జెకర్యా - యెహోవా స్మరించుము 

📎ఎలిసబెతు - దేవుని ప్రమాణము 

📎అన్న - కృప, దయ 

📎ఫిలిప్పు - అశ్వ ప్రియుడు 

📎మరియ - మిర్యాము అను హెబ్రీపదము యొక్క 📎గ్రీకురూపము (కన్యయైన మరియ)

📎మార్తా - ఇల్లాలు

📎యోహాను - యెహోవా కృపగలవాడు 

📎మెసయ్య - అభిషిక్తుడు 

📎కేఫా - రాయి 

📎నికోదెము - ప్రజలను జయించువాడు 

📎సమరయ - కావలి 

📎కోసెడు దూరం - మూడు కిలోమీటర్లు 

📎మార్తా - ఇల్లాలు

📎యూదా - స్తుతించుట 

📎పేతురు - బండ 

📎ఆదరణకర్త - ఉత్తరవాది 

📎కయప - నొక్కు 

📎షాలోమ్ - మీకు సమాధానం కలుగును గాక 

📎తోమా - కవలవాడు

Sthuthi Paadutake Brathikinchina Telugu Song Lyrics | స్తుతి పాడుటకే బ్రతికించిన

 పల్లవి:  స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా

ఇన్నాళ్లుగా నన్ను పోషించినా

తల్లివలె నన్ను ఓదార్చినా

నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా  - 2

 జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా

 నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును


1. ప్రాణభయమును తొలగించినావు

ప్రాకారములను స్థాపించినావు 

సర్వజనులలో నీ మహిమ వివరింప

 దీర్ఘాయువుతో నను నింపినావు  -2

 నీ కృపా బాహుళ్యమే-వీడని అనుబంధమై

 తలచిన ప్రతిక్షణమున-నూతన బలమిచ్చెను  ||  స్తుతి ॥


2 . నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు

 కనుమరుగాయెను నా దుఖ:దినములు

 కృపలనుపొంది నీ కాడి మోయుటకు 

లోకములోనుండి ఏర్పరచినావు -2 

 నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై

 నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను.  ॥ స్తుతి ॥


3. హేతువులేకయే ప్రేమించినావు

వేడుకగా ఇల నను మార్చినావు

 కలవరమొందిన వేళలయందు

 నా చేయి విడువక నడిపించినావు -2

 నీ ప్రేమ మాధుర్యమే- నా నోట స్తుతిగానమై

నిలిచిన ప్రతిస్థలమున -పారెను సెలయేరులై          ॥ స్తుతి ॥


 


2024 New Year Song || నీ దుఃఖ దినములు

AFC LYRICS పల్లవి: నీ దుఃఖ దినములు  సమాప్తమగునని ప్రభువే సెలవిచ్చెను  నీ అంగలార్పును నాట్యముగా మార్చి ఆనందముతో నింపును 2T నీ సూర్యుడిక అస్తమ...